Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్లీ ఫెలోస్ రివ్యూ... ప్రేక్షకుడిది.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కానీ పరిస్థితి..

ప్రేమ లీల పెళ్లి గోల అనే డబ్బింగ్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే రెండేళ్ల క్రితం విడుదలైన సినిమాను ఆర్టిస్టులు, డైలాగులకు మర్చి మరోసారి చూపించాడు. ఇదివరకే చూసేసిన సినిమా కావడంతో కనీసం సినిమా మీద ఆసక్తి

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:05 IST)
నటీనటులు: సునీల్, అల్లరి నరేష్, చిత్ర శుక్ల, నందిని రాయ్, పూర్ణ, జయప్రకాష్ రెడ్డి తదితరులు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి 
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్ 
సంగీతం: శ్రీవసంత్ 
సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్ 
ఎడిటింగ్: గౌతమ్ రాజు  
 
సోలో హీరోలుగా అవకాశాలు కలిసి రాకపోవడంతో అల్లరి నరేష్, సునీల్ కలిసి సిల్లీ ఫెలోస్ సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను వీరిద్దరూ ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక అల్లరి నరేష్, సునీల్ సిల్లీ ఫెలో సినిమా రివ్యూ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే.. 
 
ఎమ్మెల్యే జాకెట్ (జయప్రకాశ్ రెడ్డి)కి వీరబాబు(అల్లరి నరేష్), సూరి(సునీల్) రైట్, లెఫ్ట్. జాకెట్ చేసే పనుల్లో వీరిద్దరి హస్తం ఉంటుంటుంది. ఊరికే చేసే మంచి పనుల్లో భాగంగా సామూహిక వివాహాలు జరిపించడానికి సిద్ధమవుతాడు జాకెట్. వాటిని చెడగొట్టాలని అతడి ప్రత్యర్థులు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఆల్రెడీ పెళ్లి కుదిరిన సూరి.. పుష్ప(నందిని రాయ్) అనే అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వస్తుంది. ఆ విషయం కాస్త పేపర్లకు ఎక్కడంతో పుష్పతో విడాకులు తీసుకోవాలని సూరి ప్రయత్నిస్తుంటాడు.
 
మరోవైపు వీరబాబు వాసంతి (చిత్ర శుక్ల) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పోలీస్ కావాలని ప్రయత్నిస్తుండగా, దీంతో వాసంతి తల్లి వద్ద పది లక్షలు తీసుకుని ఎమ్మెల్యే జాకెట్‌కి రికమెండేషన్ చేయమని డబ్బులు ఇస్తాడు వీరబాబు. అంతలోనే జాకెట్ ప్రమాదంలో పడతాడు. రూ.500 కోట్లకు సంబంధించిన జాకెట్‌కి ఓ నిజం తెలియడంతో ఆ డబ్బుని దక్కించుకోవాలని భూతం (పోసాని కృష్ణమురళి) గ్యాంగ్ ట్రై చేస్తుంటుంది. మరి ఈ సమస్యల నుండి జాకెట్‌ని వీరబాబు, సూరి రక్షించగలిగారా..? ఇంతకీ ఆ రూ.500 కోట్ల కథేంటి..? వీరబాబు తన ప్రేమను దక్కించుకున్నాడా..? సూరి కథ సుఖాంతమైందా..? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేషణ: 
ప్రేమ లీల పెళ్లి గోల అనే డబ్బింగ్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే రెండేళ్ల క్రితం విడుదలైన సినిమాను ఆర్టిస్టులు, డైలాగులకు మర్చి మరోసారి చూపించాడు. ఇదివరకే చూసేసిన సినిమా కావడంతో కనీసం సినిమా మీద ఆసక్తి కలగదు. పోనీ డబ్బింగ్ వెర్షన్ చూడని వారికైనా ఈ సినిమా అంతగా నచ్చదు. కెరీర్ పరంగా దూసుకెళ్లాలనుకుంటున్న అల్లరి నరేష్, సునీల్ ఈ సినిమాలో ఎందుకు నటించారో తెలియట్లేదని ప్రేక్షకులు వాపోతున్నారు.
 
ప్రథమార్ధమంతా సూరి, పుష్పల పెళ్లి ట్రాక్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు సెకండాఫ్‌కు వచ్చేసరికి కూడా కథను ఒక కొలిక్కి తీసుకురాకుండా అర్థం కానీ స్క్రిప్ట్ ట్రాక్‌తో బోర్ కొట్టించారు. మధ్యలో వచ్చే పాటలైతే వినడం కాదు కదా కనీసం స్క్రీన్ మీద చూడదగిన విధంగా కూడా లేవు. అల్లరి నరేష్, సునీల్‌లు తమ నటనతో ఎంతగా నవ్వించాలని ప్రయత్నించినా పసలేకుండా పోయింది. 
 
జయప్రకాశ్ రెడ్డితో చేయించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వు తెప్పించినా.. క్లైమాక్స్‌లో మాత్రం అతడు చేసే కామెడీకి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కానీ విధంగా ఉంది. దానికి తోడు పోసాని కృష్ణమురళి తన గ్యాంగ్‌తో పాటు చేసే కామెడీ రోత పుట్టిస్తుంది. చిత్రశుక్ల ఉన్నంతలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అర్థం లేని కథను, గమ్యం లేని కథనాన్ని తయారుచేసుకుని ఏమాత్రం ప్రేక్షకులకు నచ్చని విధంగా ఈ సినిమాను రూపొందించారు. సోషల్ మీడియాలో కనిపించే జోక్స్‌ని తన సినిమా కోసం వాడుకున్నారు. సినిమాటోగ్రఫీ నాసిరకంగా వుంది. మొత్తానికి సిల్లీ ఫెల్లోస్.. ఆడియన్స్‌ను మెప్పించలేకపోయారు
 
రేటింగ్-1.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

#DuvvadaMaduriSrinivasLove: ప్రేమ గుడ్డిది కాదు.. ప్రేమను కళ్లారా చూడవచ్చు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments