రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ..

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (12:13 IST)
Ranga Ranga Vaibhavanga
మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'రంగరంగ వైభవంగా' సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది. 'ఉప్పెన' చిత్రంతో సంచలన విజయం అందుకొని వైష్ణవ్.. రెండో ప్రయత్నంగా 'కొండపొలం' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో గ్యాప్ తీసుకొని తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 
 
ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో సూపర్ రివ్యూలు వచ్చాయి. నెటిజెన్స్ నుంచి అయితే 'రంగరంగ వైభవం' చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని కొందరు అంటుంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇందులోని లవ్ అండ్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని, క్లీన్ లవ్ స్టోరీతో సినిమా సాగినా.. ఊహకందే విధంగా సన్నివేశాలున్నాయని, అందుకే అంతగా ఆసక్తికలిగించదని చెబుతున్నారు. 
 
సత్యతో కామెడీ సీన్స్ బాగున్నాయని, సెకండాఫ్‌తో పోలిస్తే ఫస్టాఫ్ కాస్త బెటరని అంటున్నారు. టోటల్ గా చెప్పాలంటే.. 'రంగరంగ వైభవంగా' చిత్రం యావరేజ్ అంటున్నారు.
 
ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్‌ను చూపిస్తూ.. ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారట. అయితే ఇంటర్వెల్ మాత్రం ఆసక్తిగా ఉంటుందట. సెకండాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకొనే విధంగా లేదని అంటున్నారు. ఇక క్లైమాక్స్ అయితే తేలిపోయిందని చెబుతున్నారు. 
 
గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ యన్ ప్రసాద్ నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments