Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు'కు ఎన్నారైల హిట్ టాక్... ప్రీమియర్ షో చూసి తేల్చేశారు...

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, విదేశాల్లో మాత్రం ఒకరోజు ముందుగా అంటే గురువారం రాత్రే ప్రీమియర్ షోల ద్వారా

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (08:47 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, విదేశాల్లో మాత్రం ఒకరోజు ముందుగా అంటే గురువారం రాత్రే ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ చేశారు. 'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్, శృతిల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఎన్నారైలు తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్ షోల ద్వారా సినిమాను చూసిన పలువురు ఎన్నారైలు సోషల్ మీడియాలో తమ స్పందనలు షేర్ చేశారు. 
 
తమిళ హీరో అజిత్ నటించిన 'వీరమ్' చిత్రానికి ఇది రీమేక్. తెలుగు నేటివిటీ, ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా కథలో మార్పులు చేసి పునర్‌నిర్మించారు. అయితే, తమిళ కథతో పోల్చితే తెలుగు కథలో పెద్దగా మార్పులు చేయకున్నా.. సినిమాను రిచ్‌గా తీశారన్నది ఎన్నారైల టాక్. 
 
ముఖ్యంగా 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్, శృతిహాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందట. ఫైట్స్, డైలాగ్స్‌లకు ప్రేక్షలు ఈలలు, చప్పట్లు, అరుపులు, కేకలతో థియేటర్లు మార్మోగి పోతున్నాయట.
 
అమ్మాయిలంటే ఏమాత్రం ఇష్టంలేని పాత్రలో పవన్ నటించి, ఆకట్టుకున్నారు. అన్నయ్యను ఎలాగైనా ప్రేమలో పడేయాలని తమ్ముళ్ల చేసే ప్రయత్నాలు కామెడీని పండించాయంటున్నారు ఎన్నారైలు. తెరపై అన్ని పాటలూ విజువల్ వండర్‌లా కనిపించాయనీ, చాలా రిచ్‌గా తెరకెక్కించారని ఎన్నారైలు చెబుతున్నారు. 
 
ఇక పృథ్వి కామెడీ ట్రాక్ బాగానే పండిందట. హీరోయిన్ తండ్రిగా నాజర్ నటన కూడా సూపర్బ్ అని చెబుతున్నారు. సినిమాలో ట్రైన్ ఫైట్ హైలెట్‌గా నిలుస్తుందట. ఓవరాల్‌గా ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ కనపరిచి.. సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఎన్నారై ప్రేక్షకులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments