Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ 'శివ' చైన్ అదిరింది కానీ.... 'ఆఫీసర్' గన్ గురి తప్పింది... రివ్యూ రిపోర్ట్

రాంగోపాల్ వర్మతో నాగార్జున సినిమా అనగానే చాలామంది గగ్గోలు పెట్టారు. వామ్మో వర్మతోనా అన్నారు. వారికి వర్మపై వున్న నమ్మకాన్ని ఎప్పటిలాగే తు.చ తప్పకుండా పాటించేసినట్లున్నాడు వర్మ. నాగార్జున-వర్మ కాంబినేషన్ అనగానే గుర్తుకు వచ్చేది శివ. ఆ చిత్రంలో నాగార్జ

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (18:14 IST)
తారాగ‌ణం: నాగార్జున అక్కినేని, మైరా సరీన్‌, అజ‌య్‌, షాయాజీ షిండే, ఫిరోజ్ అబ్బాసీ, బేబి కావ్య త‌దిత‌రులు; సంగీతం: ర‌విశంక‌ర్‌, నిర్మాత‌లు: రామ్ గోపాల్ వ‌ర్మ‌, సుధీర్ చంద్ర‌; ద‌ర్శ‌క‌త్వం: రామ్‌గోపాల్ వ‌ర్మ‌
 
రాంగోపాల్ వర్మతో నాగార్జున సినిమా అనగానే చాలామంది గగ్గోలు పెట్టారు. వామ్మో వర్మతోనా అన్నారు. వారికి వర్మపై వున్న నమ్మకాన్ని ఎప్పటిలాగే తు.చ తప్పకుండా పాటించేసినట్లున్నాడు వర్మ. నాగార్జున-వర్మ కాంబినేషన్ అనగానే గుర్తుకు వచ్చేది శివ. ఆ చిత్రంలో నాగార్జున యాక్షన్ సీన్లు, సైకిల్ చైన్లతో కొట్టుకోవడాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. సినిమా ఆద్యంతం అదిపోతుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వారి కాంబినేషన్లో సినిమా అనగానే హైప్ పెరిగిపోయింది. శివ చిత్రంలా కాకపోయినా కనీసం దానికి అటుఇటుగా తీస్తారేమోననే అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను రాంగోపాల్ వర్మ ఏం చేశాడో చూద్దాం.
 
క‌థ‌:
ముంబైలో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌ అయిన నారాయ‌ణ ప‌సారి అండ‌ర్‌వ‌రల్డ్‌ను నామ‌రూపాలు లేకుండా చేస్తాడు. ఐతే ఆయన ఫేక్ ఎన్‌కౌంట‌ర్ చేశాడ‌నే కేసు పెడతారు కొంతమంది. ఈ కేసుపై విచారించిన హైకోర్టు స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేసి, ఈ టీమ్‌కు హైద‌రాబాద్‌కు చెందిన శివాజీరావ్‌(నాగార్జున‌)ను పైఅధికారిగా నియ‌మిస్తుంది. దాంతో కేసును పరిశోధించేందుకు శివాజీరావు ముంబై వెళతాడు. ఈ క్రమంలో నారాయ‌ణ ప‌సారి దోషిగా తేల్చే కీలకమైన ఆధారాన్ని కనుగొంటాడు. దాన్ని ఆధారం చేసుకుని నారాయణను పోలీసులు అరెస్టు చేస్తారు. 
 
ఐతే అనూహ్యంగా సాక్షి హత్య చేయబడతాడు. దీనితో కోర్టులో కేసు నిలబడకపోవడంతో నారాయణ నిర్దోషిగా బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చిన నారాయణ ఎన్నో అకృత్యాలు చేసి నగరాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ప్రముఖ వ్యక్తులను హత్య చేయిస్తాడు. ఈ గొడవలను అరికట్టేందుకుగాను తిరిగి నారాయణను ఎంపిక చేస్తుంది ప్రభుత్వం. అతడిని చీఫ్ గా నియమించి స్పెషల్ ఎన్ కౌంటర్ బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూసిన నారాయణ, అండర్ గ్రౌండ్ వరల్డ్ టీంతో శివాజీరావుకు సంబంధాలున్నాయని నమ్మించేస్తాడు. మరి ఆ ఆరోపణల నుంచి శివాజీరావు ఎలా బయటపడ్డాడనేది మిగిలిన స్టోరీ.
 
నటనాపరంగా... 
 
శివాజీ రావుగా నాగార్జున సరిపోయాడు. వయసు మీద పడుతున్నా యంగ్ గా కనిపించాడు. క్రైం బ్రాంచ్ ఆఫీసరుగా చక్కగా సరిపోయాడు. ఇక నారాయ‌ణ ప‌సారి పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ న‌టుడు, హీరోయిన్ మైరా స‌రీన్ కూడా బాగా చేశారు. సినిమాలో గ్లామర్ లోటు లేకుండా చేసేందుకు తనవంతు ప్రయత్నం చేసింది. ఇంకా మిగిలిన పాత్రలు వారివారి శక్తి మేరకు నటించారు. సినిమా విశ్లేషణను చూస్తే మటుకు... శివతో పోల్చుకుని వెళ్లినవారికి అంతగా ఎక్కదు.

ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే గ్యాంగ్‌స్టర్స్ చుట్టూ తిప్పేస్తూ సినిమాను చుట్టేశాడు. సెంటిమెంట్లు వున్నప్పటికీ అవి వుండాలి కనుక వున్నట్లనిపిస్తుంది. నిర్మాణపు విలువలు కూడా అంతగా అనిపించవు. మొత్తమ్మీద చెప్పాలంటే ఇది వర్మ ఇప్పటి మార్కు సినిమా... శివ లాంటి కత్తిలాంటి సినిమా కాదంతే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

తర్వాతి కథనం
Show comments