Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్టర్ మజ్ను'.. స్లోగా సాగినా బోర్ కొట్టించలేదట (రివ్యూ)

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (11:42 IST)
అఖిల్ అక్కినేని తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచలేదని సినిమా చూసిన ప్రేక్షకులు ఇస్తున్న ట్విట్టర్ రివ్యూలను బట్టి తెలుస్తోంది. 
 
అట్లాంటాలో ప్రీమియర్ షోలో పూర్తయింది. దీనిపై ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. తన స్నేహితుడు చూశాడని చాలా బాగుందని వెల్లడించాడు. 'ఇప్పుడే నా మిత్రుడు కాల్ చేశాడు. అట్లాంటాలో ప్రీమియర్ షో పూర్తైందట. చాలా బాగుందని చెప్పాడు' అంటూ పోస్ట్ పెట్టాడు. 
 
ఈ చిత్రంలో హీరో క్లాసీ లుక్, హ్యాండ్సమ్‌గా, చాలా కూల్‌గా కనిపిస్తున్నాడనీ నెటిజన్లు పేర్కొన్నారు. ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు తన వ్యూని ప్రేక్షకుడికి అర్థమయ్యేలా వివరించడంలో సక్సెస్ కాగా, రెండో భాగం మాత్రం కాస్త నెమ్మదించినా బోర్ కొట్టించలేదని నెటిజన్లు చెబుతున్నారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి కలిసొచ్చిందట. మొత్తంమీద ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments