Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ గోపీచంద్‌ 'లౌక్యం'... బ్రహ్మానందం ఎప్పట్లానే బకరా... రివ్యూ

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (16:39 IST)
లౌక్యం నటీనటులు: గోపీచంద్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, పోసాని, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, రఘుబాబు తదితరులు; కెమెరా: వెట్రి, సంగీతం:అనూప్‌ రూబెన్స్‌, మాటలు: కోన వెంకట్‌, గోపీమోహన్‌, స్క్రీన్‌ప్లే, కోన వెంకట్‌, కథ: శ్రీధర్‌ సిపాన, దర్శకత్వం: శ్రీవాస్‌, నిర్మాత: ఆనంద్‌ ప్రసాద్‌.
 
మార్కెట్‌లోకి వచ్చిన సరుకుకు డిమాండ్‌ వుంటే.. డిమాండ్‌ సప్లై పరిస్థితి వస్తుంది. అదే వస్తువును మరొకడు అచ్చం అలాగే వుండేలా తయారుచేస్తాడు. అదేమంటే అది వ్యాపారం అనే లాజిక్కు చూపిస్తాడు. ఇందుకు సినిమా రంగం ఏమీ మినహాయింపు కాదు. ఒక సినిమా విజయవంతం అయితే అదే బాపతు చిత్రాలు వరుస కడతాయి. దానికి రచయితలు తమ పెన్నుకు పనిచెబుతారు. రాత్రింబవళ్ళు సిగరెట్లు తాగి మైండ్‌కు పని కల్పిస్తారు. కథ పాతదే అయినా ఏదో కొత్తదనం చూపించాలని తహతహలాడుతారు. అటువంటి కోవలోనిదే 'లౌక్యం'. గోపీచంద్‌ కథానాయకుడిగా ఏడాదికి పైగా గ్యాప్‌ తీసుకుని సీరియర్స్‌ రచయితల చేత కథ రాయించుకుని స్క్రీన్‌ప్లే చేయించుకుని తీసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే.... వరంగల్‌లో బాబ్జీ అనే రౌడీ చెల్లెలి పెండ్లికి సిద్ధమవుతుండగా లాక్కుపోతాడు వెంకటేశ్వర్లు(గోపీచంద్‌). ఆమె ప్రేమించిన వ్యక్తి చేతిలో పెడతాడు. చెల్లెలుపై ప్రేమతో తీసుకువెళ్ళిన వాడిపై కసితో ఊరంతా అనుచరులతో వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ సెల్ఫీ (బ్రహ్మానందం) కారులోనే ట్రావెల్‌ చేస్తూ తిరుగుతుంటారు. ఈలోగా బాబ్జీ మరో చెల్లెలు చంద్రకళ (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు వెంకటేశ్వర్లు. బాబ్జీ ప్రత్యర్థులు ముఖేష్‌రుసి ఓరోజు చంద్రకళపై ఎటాక్‌ చేస్తారు. ఇది తెలిసిన బాబ్జీ తన ఇంటికి తీసుకువచ్చి.. తననుక్ను భరత్‌కు ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. మరి హీరో ఊరుకుంటాడా? అందరినీ బురిడీ కొట్టించి తన తెలివితేటలతో(లౌక్యం) ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
నటనాపరంగా గోపీచంద్‌ బాగానే చేశాడు. ఒకే ఫార్మెట్‌లో ఆయన నటన ఉన్నా.. ఇందులో కొంచెం సిచ్యువేషన్‌ పరంగా చేసేశాడు. పెద్దగా కష్టడాల్సిన పనిలేకపోయినా ఈజీ సీన్స్‌ ఆయనకు ప్లస్‌ అయ్యాయి. రకుల్‌ప్రీత్‌సింగ్‌.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత నటించిన చిత్రం. ఆమె కూడా అలాగే చేసేసింది. బ్రహ్మానందం సెల్ఫీగా సూటయ్యాడు. బకరా అయ్యే పాత్రలో తను జీవించేశాడు. చంద్రమోహన్‌ కూడా అంతే. ఈసారి కొత్త కాన్సెప్ట్‌. బ్రహ్మానందంతోపాటు చంద్రమోహన్‌ కూడా తోడయి అటు విలన్లు, ఇటు ప్రేక్షకుల్ని బకరా చేసి నవ్వించడం. ఇక మిగిలిన పాత్రలన్నీ మామూలుగానే చేసుకుంటూ పోయాయి.
 
టెక్నికల్‌గా...
ఈ చిత్రం విజువల్‌గా కాస్త బాగుంది. వెట్రి కెమెరామెన్‌ పాటల్ని బాగా ప్రొజెక్ట్ చేశాయి. పాటలపరంగా అనూప్‌ రూబెన్స్‌.. పాత బాణీలే వాడినా.. సాహిత్యానికి సరిపడేట్లుగా వున్నాయి. గతంలో తను ఇచ్చిన ట్యూన్స్‌కు కాస్త వెరైటీగా చేశాడు. సాహిత్యం కూడా అర్థవంతంగా వుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. రీ-రికార్డింగ్‌ చిత్రానికి సరిపోయింది. స్క్రీన్‌ప్లేను కోన వెంకట్‌ చేయబట్టీ.. పాత కథే అయినా.. కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. మాటలు గోపీమోహన్‌ కలిసి పంచ్‌లకు ప్రాకులాడారు. దర్శకుడిగా లక్ష్యం తర్వాత చేసిన శ్రీవాస్ డైరెక్షన్ మామూలుగానే వుంది.
 
విశ్లేషణ 
ఊరిలో విలన్‌.. గారాల చెల్లి.. ఆమెను తన తాహతుకు ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. ఈలోగా అనాబాపతు హీరో వచ్చి జిమ్మిక్కులు చేసి ఆమెను స్వంతం చేసుకుంటాడు. ఇది ఢీ అనే సినిమా నుంచి వస్తున్నవే. మార్కెట్‌లో వచ్చిన ప్రొడెక్ట్‌ను అందరూ కొనుక్కుంటుంటే.. అదే ఫార్మెట్‌లో అటూఇటూగా మార్చేసి అమ్మేయడం అన్నమాట. ఇందులో కామన్‌గా వుండేది నవ్వించడం అనే పాయింట్‌. దానికి బ్రహ్మానందం ఎన్నుకోవడం. ప్రతి సినిమాలోనూ తనే హీరోతో సమానంగా కథను భుజానపై వేసుకుంటాడు. ఇలా రొటీన్‌ ఫార్మెట్‌లోంచి పుట్టిన చిత్రమే లౌక్యం. ఇందులో మైనస్‌లున్నా... అవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కొట్టుకుపోతాయనేది దర్శకుడి లాజిక్కు. 
 
ఊరినే గడగడలాడించే విలన్‌.. ఓ కుర్రాడి చేతిలో కీలుబొమ్మగా మారిపోతాడు. ఎందుకంటే అతను హీరో కాబట్టి. తన చెల్లెలు నిశ్చితార్థం విలన్‌ చేస్తుంటే.. అక్కడికి పెండ్లికొడుకులా హీరో తయారయినా.. ఏ ఒక్కరూ దాని గురించి అడగకూడదు. హీరో వున్న ఇంట్లోనే విలన్‌ను తీసుకువచ్చి పెట్టినా.. చుట్టుపక్కలవారెవరూ ఇది హీరోగారి ఇల్లే అని చెప్పరు. విలన్‌ ఇంటిలో హీరోకు చెందిన మనుషులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నా... విలన్‌ చాలా కాజువల్‌గా తీసుకుంటాడు. 
 
ఇంతకుముందు పాండవులు పాండవులు తుమ్మెదలా.. విలన్‌ ఇంటికి హీరో స్నేహితులు ఐదుగురు వస్తారు. రకరకాల కారణాలతో.. ఇలా  ఢీ చిత్రం నుంచి ప్రతి సినిమాల్లోనూ హీరో ఆడే డ్రామాకు బకరా అయిన బ్రహ్మానందం తెలిసినా చెప్పకపోవడం, చెప్పినా విలన్లు సరిగ్గా వినిపించుకోకపోవడం.. వంటివి మాస్‌ ప్రేక్షకుడికి ఎంజాయ్‌ చేయడానికే అనే లాజిక్కు దర్శక నిర్మాతలకు తెలుసు గనుక లాగించేస్తున్నారు.
 
మొదటిభాగం సరదాగా సాగుతుంది. రెండో భాగంలో కాస్త ట్విస్ట్‌లకు, ఛేజ్‌లు, పరుగులతో ఎంటర్‌టైన్‌ చేయిస్తూ... లాగించాడు. ప్రతి సన్నివేశాన్ని హీరో ఎలా తప్పించుకున్నాడనేది హీరో తెలివితేటలపై ఆధారపడి వుంటుంది. దాన్ని రచయితలు.. అప్పటికప్పుడు వండేసి.. వార్చేస్తారు. దాంతో హమ్మయ్య ఈ గండం గట్టెక్కిందని హీరో భావించినట్లు ప్రేక్షకుడు భావించాలి. ఇలా భావించినంతకాలం సినిమాలు ఇలాగే వస్తుంటాయి. ప్రేక్షకులు ఇలాగే చూస్తుంటారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments