Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యదేవ్ నటించిన కృష్ణ‌మ్మ‌.చిత్రం ఎలా వుందో తెలుసా.. రివ్యూ

డీవీ
శుక్రవారం, 10 మే 2024 (18:41 IST)
Krishnamma- Satyadev
నటీనటులు: సత్యదేవ్, అతిరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు
 సాంకేతికత: దర్శకుడు: వివి గోపాలకృష్ణ, నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి,  సంగీత దర్శకుడు: కాల భైరవ.
 
దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ‌మ్మ‌ చిత్రం వస్తోంది అనగానే ఏదో కొత్త విషయం చెబుతాదని ట్రైలర్  చూస్తే అర్థమయింది. విజయవాడలో వించిపేట కుర్రాళ్ళు నేపథ్యంలో కథ వుందని చెప్పేశారు. స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా, దర్శకుడిగా వి.వి గోపాలకృష్ణకు ఈ సినిమా ఎలా వుంటుందో సమీక్షలోని వెళదాం.
 
కథ:
 
భద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల), శివ (కృష్ణతేజ రెడ్డి) ముగ్గురూ అనాథలు. విజయవాడలోని వించి పేటకు చెందిన వారు. అందులో శివ పద్దతిగల వ్యక్తిగా స్క్రీన్ ప్రింటింగ్ ప్రెస్ నడుపుతుంటాడు. మిగిలిన ఇద్దరూ గంజాయి సరఫరా చేస్తూ డబ్బు సంపాదించాలని చూస్తారు. వీరిపై పోలీసుల నిఘా కూడా వుంటుంది. అలాంటిది శివ కూడా ఈ గంజాయి స్మగ్లింగ్ లో ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత వారిని పోలీసులు ఏమి చేశారు?  కథ ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష: 
 
ఈ చిత్ర కథ. ఎన్.టి.ఆర్. సింహాద్రి సినిమా రిలీజ్ నాటి కథగా దర్శకుడు రాసుకున్నాడు. ఆ సమయంలో జరిగిన యదార్థ కథగా చెప్పుకొచ్చారు. ముగ్గురు అనాథలు డబ్బుకోసం అడ్డరూటులో వెళ్ళే క్రమం పోలీసులు చిత్ర హింసలు.. ఇవన్నీ గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళంలో విచారణై (తెలుగులో విచారణ)గా విడుదలైన సినిమా ఛాయలు కనిపిస్తాయి. అందులో నేపథ్యం వేరయినా పోలీసులు ఒకరిని ఎన్ కౌంటర్ చేయడం, ఏదో సాయం చేయాలని పోలీస్ స్టేషన్ కు వస్తే అనుకోకుండా వారు కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు కూడా ఏమిటో వీరికి తెలీయకుండా పోలీసులు మానేజ్ చేయడం.. వంటి సన్నివేశాలు మక్కికి మక్కికి కనిపిస్తాయి.
 
సినిమా బ్యాక్ డ్రాప్ క్రిష్ణా నది. అక్కడ శివకు, సత్యదేవ్ లు ఇద్దరమ్మాయిలను ప్రేమించడం అనేది మొదటి భాగంలో టైంపాస్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో కథ మొదలవుతుంది. చిన్న గొడవతో పోలీస్ స్టేషన్ కు రావడం, ఆ తర్వాత పెద్ద ఇష్యూలో ఇరుక్కోవడం వంటివి.. సన్నివేశాలు, సందర్భానుసారంగా పోలీసులు, రాజకీయ పెద్దలు ఆడే నాటకాలు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 
 
ఇందులో అందరూ బాగానే నటించారు. . అతిరా రాజ్ పాత్ర ఈ సినిమాకి కీలకం. , రఘు కుంచె, నందగోపాల్ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు వివి గోపాలకృష్ణ పనితీరు కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్ లో హైలైట్ గా నిలుస్తోంది.
 
అయితే, రౌడీల కథలన్నీ ఒకేలా వుంటాయి. అది ఈ సినిమాలో వుండడమే ట్విస్ట్ అనేది లేకుండా పోయింది. మనసును కదిలించే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ కృష్ణమ్మ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, అదేవిధంగా స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలగడం వంటి అంశాలు సినిమాని రక్తికట్టించలేకపోయాయి.
 
ఈ సినిమాలో విజయవాడ వన్ టౌన్ మొత్తం చూపించాడు. కథ, కథనంలో సరికొత్త దనంతోపాటు ఆకట్టుకునేలా చెప్పాలని ట్రై చేసిన దర్శకుడు కొన్ని చోట్ల తడబడ్డాడు. గంజాయి అనేది కొండపల్లి ప్రాంతంలో గతంలో వుండేవని చెప్పుకునేవారు. దానిని కోనసీమకు ఆపాదించాడు దర్శకుడు.  నేపథ్య సంగీతాన్ని కాల భైరవ బాగా డీల్సి చేశాడు. నిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.  దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాత కృష్ణ కొమ్మాలపాటిను అభినందించాలి.  
 
ఏది ఏమైనా ఇలాంటి రౌడీ కథలలో ఎమోషన్స్, సెంటిమెంట్ అనేవి కీలకం. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. కానీ  కమర్షియల్ అంశాలు కూడా మరింతగా జోడించి చేస్తే బాగుండేది. ఇటీవలే రా కథలు వస్తున్నాయి. ఆ కోవలో ఈ సినిమా వుంది. ఎంతమేరకు ఆదరణ వుంటుందనేది ప్రేక్షకుల తీర్పును బట్టి వుంటుంది.
రేటింగ్: 2.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

తర్వాతి కథనం
Show comments