Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుభిల్లు గుభిల్లుమనిపించే "జిల్"‌... ఎలా ఉందంటే...?!!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (17:29 IST)
జిల్ నటీనటులు: గోపీచంద్‌, రాశీఖన్నా, ఊర్వశి, చలపతిరావు, బ్రహ్మాజీ తదితరులు; నిర్మాతలు: వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, సంగీతం: మొహమద్‌ జిబ్రాన్‌, దర్శకత్వం: రాధాకృష్ణ.
 
పాయింట్‌ : ఫైర్‌ ఆఫీసర్‌కూ మాఫియా డాన్‌కు మధ్య వార్‌
 
సాధారణంగా మాఫియా చిత్రాల్లో హింస ఎక్కువగా వుంటుంది. అలాంటి హింసే జిల్‌ లోనూ వుంది. గోపీచంద్‌ సినిమాలంటే యాక్షన్‌ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. కాని కొన్ని చిత్రాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్‌తో కూడా వుంటాయి. కానీ 'జిల్‌' సినిమాలో అదే లోపించింది. మరి జిల్‌ అంటే ఏమిటో చూద్దాం.

 
కథ :  జై (గోపీచంద్‌) నిజాయితీ గల ఫైర్‌ ఆఫీసర్‌. అనుకోకుండా ఓ సందర్భంలో సావిత్రిని ఆత్మహత్య యత్నం చేసుకోబోతుంటే దాని నుంచి ఆమెను రక్షిస్తాడు. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఇంకోవైపు తనకు ఎదురుచెబితే తట్టుకోలేని ముంబై మాఫియా డాన్‌ చోటా నాయక్‌(కబీర్‌)ను ముంబైలో జైలుకు తరలించే క్రమంలో అందరినీ చంపి తప్పించుకుంటాడు. తన శత్రువు బ్రహ్మాజీ హైదరాబాద్‌లో వున్నాడని అనుచరులతో వస్తాడు. బ్రహ్మాజీని రెండు పర్యాయాలు జై కాపాడతాడు. ఇది సహించలేని చోటా నాయక్‌ జైపై పగ తీర్చుకుంటాడు. ఇందులో ఎవరు గెలిచారనేది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
గోపీచంద్‌ నటుడిగా స్టైలిష్‌ యాక్షన్‌ చేశాడు. ప్రభాస్‌ చేసే తరహాలో మిర్చిలోని షేడ్స్‌ కన్పిస్తాయి. రాశీఖన్నా.. గ్లామర్‌తోపాటు లిప్‌కిస్‌లతో యూత్‌ను ఆకట్టుకుంది. మాఫియా డాన్‌గా బాలీవుడ్‌ నటుడు కబీర్‌ .. లెజెండ్‌లో.. జగపతిబాబు తరహా పాత్రలో కన్పిస్తాడు. గోపీచంద్‌కు సహాయకుడిగా డాక్టర్‌ భరత్‌ నటించాడు. ఆయన పాత్ర పరిమితమే. పినతండ్రిగా చలపతిరావు, పినతల్లిగా ఊర్వశి నటించారు. 
 
టెక్నికల్‌గా... 
ఇందులో చెప్పాల్సింది... సినిమాటోగ్రఫీ.. చాలా రిచ్‌గా కన్పిస్తుంది. వర్షంలో ఫైట్స్‌ బాగా డీల్‌ చేశాడు. డైలాగ్స్‌ పరంగా పెద్దగా ఎట్రాక్ట్‌ లేవు. సంగీతపరంగా జిబ్రాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వీక్‌గా వుంది. పాటలు ఆకట్టుకోలేదు. కథ సినిమాకు వీక్‌. దర్శకుడు కొత్తయిన రాధాకృష్ణ... కొత్త ప్రయత్నమే చేయకపోగా.. పాత చిత్రాల ఫార్మెట్‌తో రావడం ప్రధాన మైనస్‌. కామెడీ అస్సలు లేనేలేదు.
 
విశ్లేషణ.. 
సినిమా మొదటి భాగం కథ ఏమిటో అర్థంకాదు. సరదాగా సాగుతున్నా.. ఎక్కడా ట్విస్ట్‌ వుండదు. సెకండాఫ్‌లో హీరో, విలన్‌కు మధ్య వార్‌. ఆ వార్‌ వస్తుందని ముందు నుంచి తెలిసినా...అందులో కిక్‌ లేదు. సాధారణ ఫార్మెట్‌లో సినిమా వుంది. సీరియస్‌ సీన్‌ వచ్చిన వెంటనే మరలా ఓ సాంగ్‌ రావడం.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. 
 
తెలుగు సినిమాల్లో ఇప్పటి దర్శకుడు రొటీన్‌ ఫార్మెట్‌ను అవలంభిస్తున్నారు. అలాంటిదే దర్శకుడు ఈ చిత్రంలో చేశాడు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌ కొత్తగా అనిపించదు. ముంబై నుంచి వచ్చిన విలన్‌ను కేవలం ఫైర్‌ ఆఫీసర్‌ ఎదుర్కోవడం సిల్లీగా వుంది. అసలు ఫైర్‌ ఆఫీసర్లకు పెద్దగా పనివుండదని అంటారు. కానీ ఈ సినిమాలో హీరోకు కావాల్సినంత పని దర్శకుడు కల్పించాడు. 
 
కేవలం గోపీచంద్‌ను స్టైలిష్‌గా చూపించాలనే ప్రయత్నం చేసినట్లుగా వుంది. ప్రభాస్‌ స్నేహితులు నిర్మాతలు కావడం, గోపీచంద్‌తో ప్రభాస్‌ స్నేహం వల్ల ఈ సినిమా గోపీకి వచ్చింది. అయితే ఇటువంటి కథల్ని ఇప్పటి యూత్‌ చూస్తారనేది అనుమానమే. జిల్‌ పేరుతో గగుర్పాటు కల్గించే హింసే ఈ చిత్రంలో ఎక్కువగా కన్పిస్తుంది. బి-లో ఏవరేజ్‌ సినిమాగా మిగులుతుంది.
 
రేటింగ్‌: 2/5 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments