Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ కామ‌న్‌మేన్‌కు చేరువ‌య్యాయా! ఇండ‌స్ట్రీ విశ్లేష‌ణ‌

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (10:56 IST)
god fater,the ghost
ద‌స‌రారోజు ఇద్ద‌రు పెద్ద హీరోల చిత్రాలు ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చాయి.  మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ విడుద‌లైంది. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా రూపొందించాడు. ఇక చిరంజీవితో సినిమా తీయాల‌ని ఎప‌న్ప‌టినుంచో వెయిట్ చేస్తున్న ఎన్‌విఎస్‌.ప్రాస‌ద్‌, సూప‌ర్‌గుడ్ సంస్థ‌లు నిర్మించాయి. అదేవిధంగా ది ఘోస్ట్ సినిమానూ ముగ్గురు అగ్ర నిర్మాత‌లు నిర్మించారు. వారు ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ స్టోరీ నిర్మించాయి.

రాజ‌శేఖ‌ర్‌తో గరుడవేగ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఆయ‌న‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఇక ఈ రెండు సినిమాల‌పై మొద‌టిరోజు బాగుంద‌ని టాక్ వ‌చ్చినా రెండో రోజు మాత్రం ఫుల్‌గా డివైడ్ టాక్ వ‌చ్చింది. అందుకు కార‌ణం ఏమిటి? అస‌లు ఈ సినిమాలు ఎంత‌వ‌ర‌కు కామ‌న్‌మేన్‌కు చేరాయి అనేది ఇప్పుడు ఇండ‌స్ట్రీ టాక్‌. దానిపై ఇండ‌స్ట్రీ విశ్లేష‌ణ ఇలా వుంది.
 
రెండింటిలో కామెన్ పాయింట్‌
 
- రెండు సినిమాల్లోనూ నేప‌థ్యాలు వేరుగా వున్నా  కామ‌న్ పాయింట్ ఒక‌టే. గాడ్ ఫాదర్‌లో త‌న అక్క‌, త‌న మేన‌కోడ‌ల ప్రాణాలు కాపాడ‌డానికి గాడ్ ఫాద‌ర్ హోదాలో చిరంజీవి ఏమి చేశాడ‌న్న‌ది పాయింట్‌. 
- మేన‌కోడ‌లు డ్రెగ్‌కు అల‌వాటు ప‌డుతుంది. అందుకు కార‌ణం బావ స‌త్య‌దేవ్‌.
- త‌న మారు సోదరుడిని అస‌హ్యించుకున్ న‌య‌న‌తార చివ‌రికి ఎలా మారింది. గాడ్ ఫాద‌ర్ త‌న సోద‌రుడి ఎలా హెల్ప్ చేశాడు.
-  విదేశాలనుంచి ఆంధ్ర‌కు డ్రెగ్ మాఫియా ఎలా ప్ర‌వేశిస్తుంది. డ్రెగ్ మాఫియా అనుకుంటే ఏం చేయ‌గ‌లుగుతంది.
- అస‌లు స‌ల్మాన్ ఖాన్ పాత్ర ఏవిధంగా గాడ్ ఫాద‌ర్‌కు హెల్ప్ చేస్తుంది. అనేవి ఇందులో కీల‌క అంశాలు. 
 
ఇక ది ఘోస్ట్ సినిమాకు వ‌స్తే|
- నాగార్జున (ఘోస్ట్‌) త‌న సోద‌రి  (గుల్ పనాగ్) కూతురు అంటే నాగ్ మేన‌కోడ‌లు డ్రెగ్‌కు అల‌వాట‌యి త‌ల్లి చెప్పింది విన‌దు. త‌న కుటుంబానికి ప్ర‌మాదం వుంది. అది ఎవ‌ర‌నేది క‌నిపెట్టాల‌ని డైరెక్ట్‌గా ఫోన్ చేస్తుంది సోద‌రుడికి.
- ఇందులోనూ డ్రెగ్ మాఫియా ఎలా యూత్ జీవితాల్లోకి ప్ర‌వేశిస్తుంది అని చూపించాడు.
- గాడ్ ఫాద‌ర్‌లో సి.ఎం. కూతురు అయితే ఘోస్ట్‌లో వేల‌కోట్లున్న బిలియ‌న్ కూతురు కుటుంబాన్ని హీరో ఎలా కాపాడాడు? అన్న‌ది పాయింట్‌.
 
విశ్లేష‌ణ‌
 
రెండు సినిమాల‌ను చూస్తే రీమేక్‌లే. ఒక‌టి మ‌ల‌యాళ సినిమా అని తెలిసిపోయినా, రెండోది మాత్రం హాలీవుడ్‌లో ఇలాంటి త‌ర‌హా క‌థ‌లు వ‌చ్చాయి. పైకి చెప్ప‌క‌పోయినా అవి మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. అందుతో త‌మ‌ర‌హా క‌త్తితో యాక్ష‌న్ నీన్స్ వున్నాయి. 
 
- రెండు క‌థ‌ల్లోనూ వారి కుటుంబానికి దూరంగా వున్న‌హీరోలు, ఆప‌ద వ‌స్తే ఎలా సేవ్ చేశార‌నేది క‌థ‌. నేప‌థ్యాలు వేరు. అయినా డ్రెగ్ అంశం కూడా రెండింటిలోనూ క‌నిపిస్తుంది. పైగా రెండింటిలోనూ హై లెవ‌ల్ కుటుంబాలు. క‌నుక‌నే కామ‌న్ మేన్‌కు పెద్ద‌గా క‌నెక్ట్ కాదు.
 
- ఘోస్ట్ సినిమా క‌థ అయితే పూర్తిగా హై లెవ‌ల్ కుటుంబాలు.. అంబానీ, బిర్లా లాంటి స్థాయివున్న కుటుంబాలు. హైసొసైటీ కుటుంబాల్లో పిల్ల‌లు ఎలా వుంటారు.పెరుగుతారు. అనేది క‌థ‌గా తీసుకోవ‌డంతో కామ‌న్‌మేన్‌కు ఇది వ‌ర్కువ‌ట్ కాదు.
- ఘోస్ట్ మొత్తంగా చూస్తే సి.ఐ.డి. అనే సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తుంది. అందులో ఆస‌క్తికంగా ఎవ‌రు చంపారు? ఎటాక్ చేయాన‌లుకుంటున్నారు? అనేది ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. నాగ్ సినిమాలో మాత్రం త‌నే హీరో కాబ‌ట్టి లావిష్‌గా త‌మ‌రెహ అనే క‌త్తి ఫైట్‌తోనూ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తోనే కొత్త‌గా చేయాల‌ని చూశాడు.
- రెండు కుటుంబాల్లోనూ విల‌న్లు వారి వారి కుటుంబాలోనివారే, వారి వారి వ్యాపార భాగ‌స్వాములే. ఇలాంటి క‌థ‌లుఇంత‌కుముందు చాలానే వ‌చ్చాయి. నేప‌థ్యాలు వేరుగా చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని చూశారు.
 
- ఇక గాడ్ ఫాద‌ర్‌లో ఒరిజిన‌ల్ సినిమాను ఇంట‌ర్‌వెల్‌నుంచి మార్చేసి, ఒక‌ప్ప‌టి ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషా లెవ‌ల్లో త‌ను మాఫియా కింగ్ అంటూ చిరంజీవిని చూపించ‌డం విశేషం.
- రాజ‌కీయాల‌కు దూరంగా లేను. నాకు రాజ‌కీయాలు దూరంగా వున్నాయి. అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఒరిజిన‌ల్‌లేక‌పోయినా ఇక్క‌డ త‌న వ్య‌క్తిగ‌తంగా నేను రాజ‌కీయాల్లో వున్నాను. అంటూ త‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఒక ర‌కంగా గాడ్ ఫాద‌ర్‌గా వుంటాన‌ని రిలీజ్ ముందు ఇంట‌ర్వ్యూ చెప్పిన‌ట్లు.. ఇది త‌న అభిప్రాయంగా సినిమా ద్వారా చెప్పేశాడు.
 
- రెండు క‌థ‌ల్లోనూ హీరోల‌కు మాఫియాతో పెద్ద సంబంధాలే వుంటాయి. కానీ చివ‌ర్లోకానీ ఆ మాఫియా నాయ‌కుల‌కు వీరే మ‌న బాస్ అంటూ ముగింపు ఇవ్వ‌డం చిత్రంగానూ వుంటుంది.
- గాడ్ ఫాద‌ర్‌లో టీవీ ఛాన‌ల్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తూ, చుర‌క‌లు వేస్తూ, చివ‌రికి ఛాన‌ల్ బ‌త‌క‌డానికి 50కోట్ల‌కుపైగా గాడ్ ఫాద‌ర్ ఇస్తాడు. ఇప్పుడు టీవీ ఛాన‌ల్స్ ఎలా దిగ‌జారిపోయాయి అనేది క్లారిటీ చూపించినా.. వేలెత్తి చూపినా.. అది ప్రేక్ష‌కుడికి వెట‌కారంగా న‌వ్వుకోవ‌డానికి ప‌నికివ‌చ్చింది.
- ఈ రెండు సినిమా వ‌ల్ల ప్రేక్ష‌కుడికి ఏమంత ఉప‌యోగం అనేకంటే, హీరోలు తాము చేయాల‌నుకున్న సినిమా చేసి హ్యాపీగా వుండేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ నాలుగు ఉండాల్సిందే : మంత్రి నాదెండ్ల భాస్కర్

తిరుమలలో జగన్ ఫోటో వున్న చొక్కా ధరించిన అంబటి రాంబాబు (video)

నెల్లూరులో మహిళను హత్య చేసి కదులుతున్న రైల్లో నుంచి విసిరేశారు (video)

పవన్ కల్యాణ్ సర్‌తో మాట్లాడాను.. ఇదంతా గోతికాడ నక్కల ఆనందం: అనిత (video)

సీఎం సిద్ధూకు లోకాయుక్త నోటీసులు.. 6న విచారణకు రావాలంటూ కబురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments