Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ "గౌతమిపుత్ర శాతకర్ణి" రివ్యూ రిపోర్ట్.. పబ్లిక్ టాకేంటి?

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. గౌత

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (05:47 IST)
చిత్రం : గౌతమిపుత్ర శాతకర్ణి 
నటీనటులు : బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలిని, శివ రాజ్‌కుమార్
సంగీతం :చిరంతన్ భట్ 
దర్శకత్వం : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్)
ప్రొడ్యూసర్స్ : సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి
విడుదల తేది : జనవరి12, 2017
 
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య వీరత్వం చూపించారు. ఈ చిత్రం బాలకృష్ణ భార్య వశిష్టాదేవిగా శ్రియా కనిపించింది. శాతకర్ణి తల్లి గౌతమిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించింది. 
 
'ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు'. చిన్నప్పుడే ఈ విషయాన్ని గ్రహించిన శాతకర్ణి.. 33గణ రాజ్యాలుగా ఉన్న భారతాన్ని ఏకం చేశాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ట్రైలర్స్, టీజర్స్‌‌లో బాలయ్య వీరత్వం, పాత్రల గొప్పదనం స్పష్టంగా కనిపించింది. చిరంతన్ భట్ అందించిన పాటలు వీణులవిందుగాగా ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగులు భలే పేలాయి.
 
చరిత్రలో ఎదురులేని 'గౌతమిపుత్ర శాతకర్ణి' వెండితెరపై ఏం చేశాడు. వెండితెరపై బాలయ్య వీరత్వం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది. ఇంతకీ గౌతమిపుత్ర శాతకర్ణి అసలు కథ ఏంటీ.. ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది.?? అనేది వెండితెరపై చూడాల్సిందే. 
 
మరోవైపు... సంక్రాంతి రేసులో ముందే వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' సూపర్ హిట్ అని తేలిపోయింది. దీంతో.. నందమూరి అభిమానులపై కాస్త ఒత్తిడి పెరిగింది. గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ టాక్ సొంతం చేసుకొంటే మెగా అభిమానులతో కలసి కాలరేగరేయొచ్చని అని బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments