Webdunia - Bharat's app for daily news and videos

Install App

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

డీవీ
గురువారం, 23 జనవరి 2025 (15:36 IST)
Sukriti Veni Bandreddy
పద్మావతి మల్లాది దర్శకత్వంలో దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు.

ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రివ్యూను గురువారంనాడు ప్రదర్శించారు. సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
తెలంగాణాలోని ఓ గ్రామం. ఆ ఊరిలో ఓ వ్యక్తికి మంచి పొలం, పెద్ద ఇల్లు వుంటుంది. ఆ ఊరిలో అందరూ పొలం పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు. కొన్నాళ్ళకు సరైన దిగుబడి, రేటు లేక రైతులు డీలాపడిపోతారు. సరిగ్గా ఆ టైంలో ఓ ప్రాజెక్ట్ కట్టడానికి వ్యాపారవేత్త, మంత్రికి ఆ ఊరి పై కన్నుపడుతుంది. మీడియేటర్ వచ్చి పొలాలు ఇస్తే లక్షలు ఇస్తామంటాడు. ఆర్థిక సమస్యలతో అందరూ పొలాలు ఇచ్చేందుకు సంతకాలు పెడతారు. కానీ రోడ్డుకు దగ్గరలో వున్న ఓ వ్యక్తి పొలం అమ్మనీయడు. ఆయన పొలంలో పేద్ద వేవచెట్టు కూడా వుంటుంది.

ఆయన కొడుకు కూడా పొలం అమ్మేసి పట్టణం పోయి బతుదామని తండ్రితో వాగ్వాదనం దిగి హ్రుదయాన్ని గాయపరిచేలా మాటలంటాడు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆ వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తికి మనవరాలు గాంధీకి (సుకృతి వేణి) మంచి అనురాగబంధం వుంటుంది. తాత చనిపోయేముందు మనవరాలితో ఓ మాటతీసుకుంటాడు. అది ఏమిటి? తాత కోరిక నెరవేర్చడానికి గాంధీ ఏమిచేసింది? అసలు గాంధీ అని పేరు తాత ఎందుకు పెట్టాడు. ఆ పొలం, రావిచెట్టు కథేమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ సినిమా మొత్తం దర్శకురాలి క్రియేషన్ పైనే ఆదారపడి వుంది. కొన్ని గ్రామాలను మల్టీ నేషనల్ కంపెనీలు ఏవిధంగా అక్కడి వనరుల్ని దోచుకునేందుకు రైతులకు ఏవిధంగా మోసం చేస్తున్నారనేది చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో ఓ చిన్నపిల్ల ఏవిధంగా తన తాత కోరికను నెరవేర్చింది అనేది చాలా హైలైట్. ఆ పాయింట్ ను దర్శకురాలు బాగా డీల్ చేశాడు. చిన్నతనంలో పొరపొచ్చాల్లేని స్నేహితుల మధ్య ప్రేమ. తాత, మనవరాలు ప్రేమ. తండ్రి ముక్కుసూటి తనం. తల్లి వెనకేసుకురావడం వంటి సన్నివేశాలను పూజ గుచ్చినట్లుగా మహిళా తాను బాగా చూపించగలిగింది.
 
తెలంగాణ నేపథ్యం కనుక ఊరి భాష, యాస పద్ధతులు అన్నీ బాగా చూపించగలిగారు. డాక్యుమెంటరీలా వున్నా సినిమాకు సరిపడా కథ. సినిమా విడుదలకుముందే  పలు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం కరెక్టే అనిపిస్తుంది. కూతురు గురించి తండ్రి తెలుసుకునే మంచితనం హ్రుదయాల్ని పిండేస్తుంది. పట్టణం మోజులో పుట్టిన ఊరిని, ఇంటిని, పొలాన్ని కూడా లెక్కచేయకుండా వెళదామనుకున్న వారికి కనువిప్పు కలిగేలా సినిమా వుంటుంది.
 
సంభాషణల పరంగా స్వతహాగా రచయిత అయిన దర్శకురాలు చాలా కేర్ తీసుకున్నారు. నేచురల్ సంభాషణలు వున్నాయి. చెట్టు పాత్రకు తనికెళ్ళ భరణి మాటలు బాగున్నాయి. క్లయిమాక్స్ లో సెంటిమెంట్ తో ఊరంతా ఏకమయి ఒక్క తాటిపై నిలబడడం సినిమాకు హైలైట్. చాలా సింపుల్ కథను బోర్ లేకుండా ఆసక్తిగా చూపించడంలో దర్శకురాలు సఫలీక్రుతులయ్యారు. రెండు నేపథ్య గీతాల్లో సాహిత్యం బాగుంది. సుద్దాల అశోక్ తేజ బ్రాండ్ కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. హింసనే నమ్ముకుని సినిమాలు తీసి రక్తపాతం చూపించే దర్శకుడు సుకుమార్ బిడ్డ ద్వారా హింసకంటే అహింస ఎంత ముఖ్యమో తెలియజెప్పేవిధంగా దర్శకురాలు సినిమా చేయడం చాలా విశేషమనేచెప్పాలి. ఇలాంటి సినిమాకు రేటింగ్ ఇవ్వడం మంచిదికాదు. అందరూ చూడతగ్గ సినిమా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

భార్యను నగ్నంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు.. ఆ తర్వాత మత్తుమందిచ్చి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

తర్వాతి కథనం
Show comments