Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు తెలుగు సినిమా ఎలా ఉండాలో అదే 'ఎర్రబస్సు'... రివ్యూ రిపోర్ట్

Webdunia
శుక్రవారం, 14 నవంబరు 2014 (16:59 IST)
'ఎర్రబస్సు' నటీనటులు: దాసరి నారాయణరావు, మంచు విష్ణు, క్యాథరిన్‌ థెరిసా, బ్రహ్మానందం, హేమ, రఘుబాబు, కాశీవిశ్వనాథ్‌ తదితరులు; కెమెరా: అంజి, సంగీతం: చక్రి, కథ: ఎన్‌. రాఘవన్‌, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: దాసరి నారాయణ రావు.
 
పాయింట్‌: తాత ప్రేమ కోసం గోల్‌నే త్యాగం చేసిన మనవడి కథ
 
కథ: సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే రాజేష్‌(మంచు విష్ణు)కు అమెరికా వెళ్ళాలనే పిచ్చి. అందుకోసం తన బాస్‌ చేత ఓకే చేయిస్తాడు. మూడునెలల్లో ఓ ప్రాజెక్ట్‌ చేస్తే వెళ్ళొచ్చని చెబుతాడు. ఎలాగో వెళుతున్నాను కదా అని ఊరిలో వున్న ఒక్కగానొక్క తాత రామనారాయణ స్వామి(దాసరినారాయణరావు)ని సిటీకి పిలిపించి ఆనందంగా వుంటే చూడాలనుకుంటాడు. అయితే అప్పటికే రాజీ(క్యాథరిన్‌)తో ప్రేమలో పడతాడు రాజేష్‌. 
 
ఇక తాత ఇక్కడికి వచ్చాక కాలనీలో వుండే చుట్టుపక్కల వారికి తాత కొరకరాని కొయ్య అవుతాడు. రాజీకి అదే పరిస్థితి. ఎక్కడా ఫ్రీడమ్‌ లేదని ఫీలవుతుంది. తాత చేసే చేష్టలు మనవడి గోల్‌కు గండి పెడతాయి. దీంతో ఆవేశంతో తాతను నడిబజారులో నిలదీసి వెళ్ళిపొమ్మంటాడు. దాంతో వారికి కన్పించకుండా పోతాడు. ఆ తర్వాత జరిగిన కథే మిగిలిన సినిమా.
 
పెర్ఫార్మెన్స్‌: 
నటుడిగా దాసరి నారాయణరావుకు ప్రత్యేక ముద్ర వుంది. తాత పాత్రలో ఇమిడిపోయాడు. గతంలో మామగారులో నటించిన మామగారిలా ఇందులోనూ తాతగా ఒదిగిపోయాడు. మనవడిగా మంచు విష్ణు నటించాడు. రొటీన్‌ హీరోయిజం కాకుండా కామన్‌మేన్‌గా నటించాడు. అయితే ఇంకా డైలాగ్‌లు ముద్దముద్దగా విన్పిస్తుంటాయి. అవి కొద్దిగా మార్చుకోవాలి. క్యాథరిన్‌ ఓకే అనిపించేలా చేసింది. ఉపన్యాసాలతో అదరగొట్టే బ్రహ్మానందం పాత్ర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఇక మిగిలిన పాత్రలు షరా మామూలే.
 
టెక్నికల్‌గా....
పాటలు పరంగా సీమంతం పాట చాలా బాగుంది. మిగిలినవీ ఓకే.. సంగీతపరంగా చక్రి బాగానే చేశాడు. రీ-రికార్డింగ్‌ ఓకే. డైలాగ్స్‌ పరంగా దాసరి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అచ్చమైన తెలుగు సినిమాకు ఎలా వుండాలో అలా రాయించుకున్నాడు. విలేజ్‌లో పిలుచుకునే కొన్ని డైలాగ్‌లు విన్పిస్తాయి. హీరోను బుల్లి బెల్లం అనే డైలాగ్‌ చిత్రంలో హైలెట్‌. స్క్రీన్‌ప్లేలో కొత్తదనం లేకపోయినా ఫర్వాలేదు. కెమెరా పనితనం ఓకే. డి.ఐ. గ్రాఫిక్స్‌ వర్క్‌ కాకుల గుంపులా కన్పిస్తుంది. 
 
విశ్లేషణ :
ఇది తమిళంలో విజయవంతమైన 'మంజాతై' చిత్రానికి రీమేక్‌. అందులో రాజ్‌ కిరణ్‌ తాతగా నటించాడు. హీరోగా కొత్త వ్యక్తి చేశాడు. ఆ చిత్రంలో తాత పాత్రకు మంచి పేరు వచ్చింది. అది నచ్చే దాసరి నారాయణరావు ఈ ప్రయోగం చేశాడు. తాతగా తెలుగులో మరొకరిని ఊహించుకోలేం. సినిమా మొత్తం ఆయనే భుజాలపై మోస్తాడు. రెగ్యులర్‌ హంగులు, ఆర్భాటాలు లేకుండా అసలు తెలుగు సినిమా ఎలా వుంటుందో దాసరి చూపించాడు. టెక్నికల్‌గా ఎంత డెవలప్‌ అయినా... సెంటిమెంట్‌ మాత్రం ఎప్పుడూ మారదనే పాయింట్‌తో దాసరి ఈ సినిమా తీశాడు. టైటిల్‌ కూడా క్యాచీగా వుంది. 
 
అయితే ఇప్పటి జనరేషన్‌కు అవి కొత్తగానూ వింతగానూ చిరాకుగా అనిపించినా...ఇంటికి పెద్దదిక్కు లాంటి ఓ వ్యక్తి.. తాతలాంటి మనిషి వుంటేనే ఆ ఇల్లు కుటుంబం బాగుపడుతుంది. లేదంటే.. ఎవడి గోల వాడిదేగా మారుతుంది. జనరేషన్ గ్యాప్‌తో సెంటిమెంట్లు మరుగవుతున్నా... ఆ రుచి ఎలా వుంటుందో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు. పక్కా ఫ్యామిలీ చూసే సినిమా ఇది. ఇది ఎంతమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.
 
రేటింగ్‌: 2.5/5 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments