Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామారావు డ్యూటీ స‌రిగ్గా చేశాడా! రివ్యూ రిపోర్ట్‌

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (13:44 IST)
Ravi Teja, Divyansha Kaushik
నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి తదితరులు.
 
సాంకేతిక‌త‌- దర్శకత్వం : శరత్ మండవ, నిర్మాత: సుధాకర్ చెరుకూరి,  సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్., సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్.  ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.
విడుదల తేదీ : జులై 29, 2022
 
మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన `రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈరోజే విడుద‌లైంది. క‌రోనా పీక్ టైంలో క్రాక్ చేసి థియేట‌ర్ల‌లో ఆవురావురంటున్న ప్రేక్ష‌కుల చేత‌ హిట్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత ఖిలాడి సినిమా చేసి ఏవ‌రేజ్‌గా నిలిచిన ర‌వితేజ స్పీడ్ పెంచి ఐదు సినిమాలు చేస్తున్నాడు. అందులో రామారావు ఆన్ డ్యూటీ విడుద‌లైంది. రాముడు లాంటి మంచి మ‌నిషి అని చిత్ర యూనిట్ ర‌వితేజ పాత్ర గురించి చెబుతుంది. మ‌రి ఆ రాముడు ఏం చేశాడో స‌మీక్ష‌లోకి వెళ‌దాం. 
 
కథ :
 
రామారావు (రవి తేజ్) ఒక సబ్ కలెక్టర్. త‌న ప‌రిధిలో అన్యాయం జ‌రిగితే వారితో ఫైటింగ్ చేస్తాడు. అలా మొద‌ట‌గా రైతుల భూముల‌కు న్యాయం చేస్తాడు. అత‌ని పై అధికారి త‌నికెళ్ళ భ‌ర‌ణి అండ‌తో ప్ర‌జ‌ల‌కు మంచిప‌నులు చేయ‌డానికి శాయ‌శ‌క్తులా కృషిచేస్తాడు. దాంతో కొన్ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొని  తన భార్య నందిని (దివ్యాంశ కౌశిక్)తో కలిసి చిత్తూరు జిల్లాకు ఎమ్మార్వో గా వస్తాడు. 
 
ఆ ఏరియాలో యస్ ఐగా మురళి (వేణు తొట్టెంపూడి) చ‌ర్య‌లు అనుమానాస్ప‌దంగా వుండ‌డంతో ఎదిరిస్తాడు. ఈ క్ర‌మంలో మాలిని (రజిషా విజయన్) త‌న భర్త మిస్ అయ్యాడ‌ని పోలీసుస్టేష‌న్‌కూ, ఎం.ఆర్‌.ఓ. కార్యాల‌యంలో ఫిర్యాదు చేస్తూ లెట‌ర్లు రాస్తుంది. ఓ ద‌శ‌లో రామారావుకు తెలిసి ఎంక్వ‌యిరీ మొద‌లు పెడ‌తాడు. అందులో లోతుగా వెళ్ళ‌గా స్మ‌గ్గింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అలా కొన్ని షాకింగ్ నిజాలుకూడా తెలియ‌డంతో పోలీస్ ప‌రిధిలోని ప‌నులు సివిల్ ఆఫీస‌ర్‌గా రామారావు ఎలా ఛేదించాడు అన్న‌ది క‌థ‌.
 
విశ్లేష‌ణ‌-
 
క‌థ‌గా తీసుకుంటే పాత క‌థే. విడుద‌ల‌కు ముందు ఇసుక మాఫియా అని ద‌ర్శ‌కుడు చెప్పి మోసం చేశాడు. కానీ అస‌లు వేరేగా వుంది. అందుకే ఆ క‌థతో సాగ‌డంతో ఫుష్ప సినిమా గుర్తుకు వ‌స్తుంది. విచిత్రం ఏమంటే, ఎర్ర‌చంద‌నం నీటిలో తేలుతుంది. అందుకే ఈజీగా న‌దులద్వారా దాటేస్తామంటూ చూపించాడు. కానీ రామారావు.. సినిమాలో చిన్న నీటి గుంట‌లోకూడా దుంగ మునిగిపోతుంది. అందుకే ఈజీగా కాలువల్లోనూ దాచేస్తామంటూ చెబుతాడు. ఈ పాయింట్ చెప్ప‌డానికే సినిమా తీసిన‌ట్లుగా అనిపిస్తుంది.
 
- స‌బ్ క‌లెక్ట‌ర్‌గా ర‌వితేజ స‌రిపోయినా స‌హ‌జంగా వ‌చ్చే వ‌య‌స్సురీత్యా వ‌చ్చే హావ‌భావాలు డైలాగ్ డెలివ‌రీ ప‌వ‌ర్ త‌గ్గిన‌ట్లుంది. వేణు సెకండ్ ఇన్నింగ్స్‌గా ఈ సినిమాలో ఎస్.ఐ. పాత్ర పోషించినా పోలీసు ప‌వ‌ర్‌, క‌న్నింగ్‌నెస్‌, అందులో కొంత మంచిత‌నం అనేది  ఇంకా పండించాల్సింది. ఇక ఈ క‌థ‌లో థ్రిల్ల‌ర్‌, స‌స్పెన్స్ క‌లిగించేలా కొన్ని పాత్ర‌లు వ‌స్తుంటాయి. సీరియ‌స్ క‌థ‌లో కామెడీగా వుండేలా ద‌ర్శ‌కుడు సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్ర లోకేష్ పాత్ర‌లు జంట‌కాకుండా వేరేవేరే జంట‌లుగా చూపించ‌డంతో థియేట‌ర్లో ఒక‌టే గోల‌. క‌థ ప్ర‌కారం రైతు స‌మ‌స్య‌లు, పొలిటిక‌ల్ ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఓపెనింగ్ షాట్‌లో చూపించి క‌థ పాల‌క పార్టీపై ఎక్కుపెట్ట‌నట్లు భ్ర‌మింప‌చేసిన  ద‌ర్శ‌కుడు ఆ త‌ర్వాత పోలీస్ వ్య‌వ‌స్థ లోపాల‌ను ఎత్తిచూపుతాడు. ఇంకోవైపు హాంకాంగ్ మాఫియా ఇక్క‌డ ఎర్ర‌చంద‌నం దొంగ‌ల్ని ఎలా త‌మ వ‌ద్ద‌కు తీసుకు వ‌స్తుందో అనే మ‌రో క‌థ‌వైపు మ‌ల్లించాడు.
 
ప్లస్ పాయింట్స్ :
-  హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్ గా నటించిన రజిషా విజయన్ ఓకే అనిపిస్తుంది. చిత్తూరు అడ‌వులు, 1995కాలంనాటి ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, సినిమాటో గ్ర‌పీ బాగుంది.
 
మైనస్ పాయింట్స్ :
అంద‌రూ చెప్పేది ఒ క్క‌టే. క‌థ‌లు ఎక్క‌డా పుట్ట‌వు. స‌మాజంలోనే పుడ‌తాయి అంటారు. అలా స‌మాజంలో పుట్టిన క‌థ‌ను తీసుకున్న ద‌ర్శ‌కుడు దాన్ని అబ్బుర‌ప‌రిచితే మ‌లుపుల‌తో చూపిస్తే మ‌రింత ఆక‌ట్టుకునేది. ఓపెనింగ్ షాట్‌లో జ‌డ్జిగా ఓ మ‌హిళ‌ను చూపిస్తారు. ఆ పాత్ర‌లో హుందాత‌నం లేదు. అప్ప‌టికే పుష్ప సినిమాలో ఈ పాయింట్‌పై చాలా విష‌యాలు ప్రేక్ష‌కులు తెలిసిపోయాయి. అలాంట‌ప్పుడు మ‌రింత క‌థ‌పై క‌స‌ర‌త్తు చేస్తే బాగుండేది. 
- సీసా పాట కూడా స‌రైన టైంలో రాలేదు. ఎస్‌.ఐ. ముర‌ళీతో సీరియ‌స్ చ‌ర్చ అనంత‌రం సాంగ్ చూపించాడు. కానీ ముందుగా ఊరి జాత‌ర‌కు వ‌చ్చిన రామారావు.. సాంగ్ చూస్తుండ‌గా ఎస్‌.ఐ. ముర‌ళీ పాత్ర వ‌స్తే మ‌రింత బాగుండేది. 
- ఒక స‌బ్ క‌లెక్ట‌ర్‌కు పాల‌క పార్టీవారి ఒత్త‌డి, స‌పోర్ట్ వుంటేనే ఏదైనా చేస్తాడు. ఇక్క‌డ ఏకంగా సి.ఎం. పేచీలో ప‌నిచేసే త‌నికెళ్ళ భ‌ర‌ణి నుంచి స‌పోర్ట్ వ‌స్తుంది. ఈ పాయింట్‌ను మ‌రింత‌గా సామాజిక అంశాలతో చొప్పిస్తే బాగుండేది. 
 
- ఈ కథలో ఫుల్ యాక్షన్ ఉంది. ర‌వితేజ డైలాగ్‌కంటే పంచ్ ప‌వ‌ర్ అదుర్స్‌లా సినిమాటిక్‌గా చూపించాడు.  టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సామ్ సి.ఎస్. సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది.   నిర్మాత సుధాకర్ చెరుకూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
 
- ఇలాంటి క‌థ‌లు చెప్పేట‌ప్పుడు లాజిక్‌గా కొన్ని విష‌యాలు చూపిస్తే బాగుండేది.   ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం చిత్రానికి ప్ర‌ధా లోపం. ప్రేక్ష‌కులు ఏ మేర‌కు తీర్పు ఇస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments