Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊహకందని మలుపులు.. విజువల్ - గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్‌తో 'బాహుబలి'.. ఫస్టాఫ్ స్టోరీ ఎలా వుందంటే..?

Webdunia
శుక్రవారం, 10 జులై 2015 (10:22 IST)
ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ వచ్చిన "బాహుబలి" చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో మొదటి భాగంలో కథ ఎంతో ఆసక్తిగానూ, ఊహకందని మలుపులతో ఉంది. మహిష్మతి రాజ్య రాణిగా దేవయాని (అనుష్క) ఉంటుంది. ఈమెపై భల్లాల దేవుడు(రానా) కన్నువేస్తాడు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని భావిస్తాడు. ఇందుకు ఆమె సమ్మతించక పోవడంతో ఆమెను బందీగా చేస్తాడు. 
 
అయితే, తన బిడ్డను తనకు అత్యంత నమ్మకస్తురాలు, సాహసవంతురాలైన శివగామి (రమ్యకృష్ణ) ద్వారా దేశం దాటిస్తుంది. దేశాన్ని దాటించేటపుడే తన బిడ్డకు బాహుబలి (ప్రభాస్) అని నామకరణం చేస్తుంది దేవయాని. అయితే, బాహుబలి ఓ గిరిజన తెగకు చెందిన ప్రజల్లో పెరిగి పెద్దవాడవుతాడు. 
 
ఆ ప్రజలు అతనికి శివుడు అని పేరుపెడతాడు. ఈ క్రమంలో అనేక మలుపులు ఉంటాయి. మొదటి భాగంలో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో బాహుబలిని తెరకెక్కించారు. ముఖ్యంగా విశాలమైన సామ్రాజ్యంతో పాటు కొండ ప్రాంతం, స్నోఫాల్స్‌ను విజువల్ గ్రాఫిక్స్‌తో అత్యద్భుతంగా చిత్రీకరించారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని మాయ చేస్తూ బాహుబలి మొదటి భాగం ఫస్టాఫ్‌ను లాగించేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments