Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిషన్ "మిహిర" సక్సెస్ అయిందా? : 'అంతరిక్షం' మూవీ రివ్యూ ఎలా ఉంది?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (09:38 IST)
'ఘాజీ' వంటి విభిన్నచిత్రాన్ని నిర్మించిన సంకల్ప్ రెడ్డి తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "అంతరిక్షం". వరుణ్ తేజ్ హీరోగా నటించగా, అదితి రావు హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు అమెరికాలో ప్రదర్శించారు. దీంతో ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది ఎన్.ఆర్.ఐ తెలుగు ప్రేక్షకులు తమ స్పందనను ట్విట్టర్‌లో తెలియజేస్తున్నారు. వారి స్పందన మేరకు ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం.
 
'అంతరిక్షం' చిత్రాన్ని స్పేస్ గ్రావిటీ హాలీవుడ్ చిత్రం తరహాలోనే నిర్మించారు. గతంలో వచ్చిన 'టిక్ టిక్ టిక్' చిత్రం కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఇపుడు అంతరిక్షం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ప్రయత్నం నెరవేరిందని చెప్పొచ్చు. 
 
మిహిర అనే శాటిలైట్‌లో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి వరుణ్ తేజ్, అదితిరావు హైదరి ఎలా కృషి చేశారన్నదే చిత్ర కథ. తొలి భాగమంతా అంతా పాత్రల పరిచయాలతోనే ముగిసింది. రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది. ఈ సెకండ్ హాఫ్‌ను దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు. మొత్తానికి మిషన్ మిహిర సక్సెస్ అయిందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రంలో హాస్యం అనేది పెద్దగా కనిపించదు. నిజానికి తెలుగు చిత్రాలంటే హాస్యం ఉంటుందన్నది సినీ ప్రేక్షకుల్లో నాటుకునిపోయింది. కానీ, ఈ చిత్రంలో అలాంటివేవీ కనిపించవు. ఈ ఒక్క విషయం మినహా చిత్రం అద్భుతంగా తీశారని చెబుతున్నారు. అయితే, గ్రాఫిక్స్‌పై మరింత శ్రద్ధ పెట్టివుంటే మరింతగా బాగుండేదని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments