Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెట్రిమారన్ దర్శకత్వంతో ఆకట్టుకున్న విడుదల, రివ్యూ

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (16:40 IST)
vidudala poster
వెట్రిమారన్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మరియు తెలుగులో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆడుకాలం, అసురన్, వడ చెన్నై వంటి కల్ట్ చిత్రాలను అందించారు. ఈ దర్శకుడి విడుతలై  సినిమా తెలుగులో "విడుదల పార్ట్ 1" తొలిసారి విడుదలై అన్ని చోట్ల  నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
 
విడుదల పార్ట్ 1 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి సమీక్షలను పొందింది. వెట్రిమారన్ ఈ రా స్టోరీని అద్భుతమైన సన్నివేశలతో అద్భుతంగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ రియలిస్టిక్ గా అనిపించాయి. రైలు ప్రమాద సన్నివేశం మొత్తం సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. 
 
కథ: 1980లో కథ. తమిళనాడులోని ఓ గ్రామంలో ఖనిజాలు ఉంటాయి. వాటిని ప్రభుత్యము ప్రైవేట్ వారికి అప్పగిస్తుంది. ఎదురుతిరిగితే ఆ గ్రామస్థులను పోలీస్ బలగంతో దాడిచేస్తుంది. అక్కడి వారిని ఎడ్యుకేట్ చేసి మా ఊరులోని ఖనిజాలు మా హక్కు అని ఎలుగెత్తి చాటిన విజయసేతుపతికి నక్సలైట్ ముద్రపడింది. అప్పుడు స్పెషల్ పోలీస్ కంపెనీ విజయసేతుపతి కోసం వేటాడుతుంది.  ఆ సమయంలో కొత్తగా పోలీసు డ్యూటీకి సూరి వస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మిగిలిన సినిమా.  
 
విశ్లేషణ: ప్రతి పాత్ర వెనుక వెట్రిమారన్  చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. అతని అసలైన మరియు గ్రామీణ చిత్ర నిర్మాణ శైలి అందరిని సప్రైజ్ చేసింది. ఈ సినిమాలో  సమాజాన్ని ప్రశ్నించే సామాజిక సందేశం మరియు సాధారణ ప్రజలు వ్యవస్థ యొక్క మరొక వైపు కూడా చూసేలా చేస్తుంది. సూరి, విజయ్ సేతుపతి మరియు భవానీ శ్రీల నటన కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
 
ఈ కథ భారత్ కథ. అన్ని చోట్ల ఖనిజాలకోసం ప్రభుత్యాలు ప్రజలని మోసంచేసి ప్రైవేట్ పరం చేస్తున్నాయి. ఈ కోణంలో తెలుగులో సినిమాలు వచ్చినా ఇంత లోతుగా తీయలేకపోయారు. పోలీస్ కంపెనీ అధికారి నిరంకుశం, శాడిజం, ఖరుకుతనం గతంలో రజాకార్ల ఉద్యమాన్ని తపిస్తుంది. ఏవి కాళ్లకు కట్టినట్లు చూపించడం చిత్రంలో హైలెట్.  ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా. 
 
వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ తప్పక చూడాలి. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు వెట్రిమారన్. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఆర్. వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసారు. లెజెండరీ సంగీత విద్వాంసులు మాస్ట్రో ఇళయరాజా చిత్ర సౌండ్‌ట్రాక్‌ను సమకూర్చారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అయ్య బాబోయ్..అదానీ గ్రూప్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోలేదు.. వైకాపా

అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments