డా|| కె.వి.సతీష్ హీరోగా కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డి.ఎస్.మ్యాక్స్ సమర్పణలో క్రిష్వి ఫిలింస్ పతాకంపై ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆశా సతీష్ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'యమలీల-2'. ఈ నెల 28న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో డా|| బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటించారు. ఇరవై ఏళ్ళ క్రితం అలీ హీరోగా వచ్చిన 'యమలీల' చిత్రంలో చిత్రగుప్తుడిగా నటించిన బ్రహ్మానందం ఇప్పుడు డా|| కె.వి.సతీష్ హీరోగా వస్తోన్న 'యమలీల-2' చిత్రంలో కూడా చిత్రగుప్తుడిగా నటించడంపై ఆయన స్పందన తెలియజేస్తూ..
''క్రిష్వి ఫిలింస్ బేనర్లో ఎస్వీ కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం యమలీల-2. గతంలో వచ్చిన యమలీల చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా 'యమలీల-2' పేరుతో సతీష్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ కృష్ణారెడ్డిగారు ఎంతో కష్టపడి అద్భుతంగా తీసిన సినిమా. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంటే. సినిమా అంతా నవ్వుతూ చూడాల్సిందే. మధ్యలో కృష్ణారెడ్డిగారి మార్క్. సెంటిమెంట్ ఈ సినిమాలో బాగా పండింది. కళాప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుగారు ఈ సినిమాలో యమధర్మరాజుగా యాక్ట్ చెయ్యడం విశేషం. ఇది ఈ సినిమాకి స్పెషల్ క్వాలిటీగా, స్పెషల్ ఎస్సెట్‌గా చెప్పొచ్చు. యమలీలలో సత్యనారాయణగారు యమధర్మరాజుగా నటిస్తే, యమలీల2లో మోహన్‌బాబుగారు ఆ క్యారెక్టర్లో నటించారు.
మోహన్‌బాబుగారు ఆల్రెడీ యమదొంగ చిత్రంలో యమధర్మరాజుగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. నేను చిత్రగుప్తుడిగా ఆయన కాంబినేషన్లో ఈ చిత్రంలో చాలా మంచి సీన్స్ చేశాం. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో గ్రాఫిక్స్‌లో ఎంతో ఖర్చు పెట్టి తీశారు. అవి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయన్న ప్రగాఢ నమ్మకం నాకు వుంది. ముఖ్యంగా ఎస్వీ కృష్ణారెడ్డిగారి మ్యూజిక్ చాలా హాయిగా, ఎంతో ప్రశాంతంగా వుంటుంది. ఎలాంటి గొడవ లేకుండా వినేలా ఆయన పాటలు వుంటాయి. హీరోయిన్గా దియా నికోలస్ నటించింది. సతీష్, నికోలస్ల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా వున్నారు.
వాళ్ళిద్దరి మధ్య ఒక పాప సెంటిమెంట్ వుంటుంది. అలాగే షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థిల కామెడీ కూడా చాలా బాగా వచ్చింది. వీరితోపాటు గబ్బర్‌సింగ్ గ్యాంగ్ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతున్న కాన్ఫిడెన్స్ నాకు వుంది. ఈ సందర్భంగా 'యమలీల-2' యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను'' అన్నారు.