Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నతో ముగిస్తే ట్విస్ట్ వస్తుందనుకున్నాం.. కానీ ఆటంబాంబై పేలింది.

చిత్రం విడుదలకు ముందు పీక్‌కి వెళ్లిన సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి మంచి సినిమా అంటే ఏదితో మొదలు పెట్టి బాహుబలి సినిమా విశిష్టత గురించి మీడియాతో పంచుకున్నారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నతో తొలి భాగం ముగిస్తే మంచి ట్విస్ట్‌ అవుతు

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (03:23 IST)
మరో 15 గంటల్లో ప్రపంచంపై బాహుబలి-2 దండయాత్ర ప్రారంభం కానుంది. చిత్రపరిశ్రమలో కనీవినీ ఎరుగని ప్రమోషన్ కార్యక్రమాల్లో బాహుబలి టీమ్ మునిగిపోయింది. ఒక రోజులో పదీ పదిహేను టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు, పత్రికలతో స్పెషల్ చిట్ చాట్స్, ఎక్కడ చూసినా బాహుబలి టీమ్ విన్యాసాలే. బాహుబలి టీమ్ ఎక్కని గడపా దిగని గడపా లేదు అనేంత విస్తృతంగా దేశవిదేశాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. చిత్రం విడుదలకు  ముందు పీక్‌కి వెళ్లిన సందర్భంగా చిత్ర దర్శకుడు రాజమౌళి  మంచి సినిమా అంటే ఏదితో మొదలు పెట్టి బాహుబలి సినిమా విశిష్టత గురించి మీడియాతో పంచుకున్నారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నతో తొలి భాగం ముగిస్తే మంచి ట్విస్ట్‌ అవుతుందనుకున్నాం. కానీ అది ఆటమ్‌బాంబులా పేలుతుందని ఊహించలేదు అనేశారు రాజమౌళి. బాహుబలి- 2 సినిమా విశేషాల గురించి తన మాటల్లోనే విందాం.
 
అసలు బాహుబలి మొదటి భాగాన్ని కట్టప్ప ప్రశ్నతో ముగించాలనుకోలేదు. సినిమాకు మంచి ముగింపు కావాలి. అందులో కన్న కొడుకును కాదని అమరేంద్ర బాహుబలిని రాజును చేస్తుంది శివగామి. ఆమె ఎందుకు  చేసిందో కూడా చెబుతుంది. ప్రజలంతా బాహుబలికి జయహారతులు పట్టారు. అక్కడితో ముగిస్తే సరిపోతుందనుకున్నా. కానీ, ఫ్లా్యష్‌బ్యాక్‌లో చెప్పిన కొన్ని పాత్రలున్నాయి. వాటిని అర్ధాంతరంగా వదిలేయకూడదు. వాళ్లను సాదాసీదాగా చూపించకుండా ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే ప్రశ్నతో ముగిస్తే మంచి ట్విస్ట్‌ అవుతుందనుకున్నాం. అది ఆటమ్‌బాంబులా పేలుతుందని ఊహించలేదు.
 
ఓ సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందులో పాత్రలను మర్చిపోలేక పోతే అది మంచి సినిమా. ‘బాహుబలి’ విడుదలైన ఇన్ని నెలల తర్వాత కూడా ప్రేక్షకులు మాట్లాడుతున్నారంటే నాన్నగారు సృష్టించిన శక్తిమంతమైన పాత్రలే కారణం. ‘బాహుబలి’ విజయంలో సింహభాగం పాత్రలకే ఇస్తాను. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడో శుక్రవారం అందరికీ తెలుస్తుంది. సస్పెన్స్‌ వల్ల సినిమా ఆడదు. అందులోని డ్రామా వల్లే ఆడుతుంది
 
చిన్న వయసులో ‘మాయాబజార్‌’ చూశా. దర్శకుణ్ణి అయ్యాక అప్పట్లోనే అంత గొప్ప సీన్లు ఎలా తీశారా అని ఆలోచించా. రెండు నిమిషాల పాటలో పాత్రలన్నిటినీ పరిచయం చేశారు. గ్రాఫిక్స్‌ కూడా అద్భుతం. కేవీ రెడ్డిగారికి హ్యాట్సాఫ్‌.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments