Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్‌ సీన్స్‌ 'గెలుపు గుర్రం' శ్రుతిహాసన్‌!!

Webdunia
సోమవారం, 2 జూన్ 2014 (21:00 IST)
'గబ్బర్‌సింగ్‌, బలుపు, ఎవడు' వంటి బ్లాక్‌బస్టర్స్‌తోపాటు తాజాగా 'రేసుగుర్రం' వంటి మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న అరేబియన్‌ గుర్రం వంటి అందాల భామ శ్రుతి హాసన్‌ నటించిన 'డి-డే' అనే హిందీ చిత్రాన్ని 'గెలుపుగుర్రం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ వేశ్యగా నటించడం ఓ ముఖ్య విశేషం. 
 
ఈ చిత్రం కోసం శ్రుతిహాసన్‌ నటించిన హాట్‌ సీన్స్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం తెలిసిందే. సి.ఆర్‌.రాజన్‌ సమర్పణలో.. 'డర్‌ సినిమా' మరియు 'సురేష్‌ సినిమా' బ్యానర్స్‌పై సురేష్‌ దూడల ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. డ్రగ్స్‌ మరియు మాఫియా నేపధ్యంలో నిఖిల్‌ అద్వాని దర్శకత్వంలో రూపొంది.. హిందీలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌, ఇర్ఫాన్‌ఖాన్‌, రిషికపూర్‌, అనిల్‌కపూర్‌, నాజర్‌, హుమా ఖురేషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 
 
తెలుగులో 'కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, విశ్వరూపం' చిత్రాలకు సంగీతాన్ని అందించి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన బాలీవుడ్‌ అగ్రశేణి సంగీత దర్శకులు, సంగీత త్రయం 'శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌' స్వర సారధ్యం వహించిన 'గెలుపుగుర్రం' చిత్రం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 
 
ఈ సందర్భంగా 'గెలుపుగుర్రం' నిర్మాత సురేష్‌ దూడల మాట్లాడుతూ.. ''శ్రుతిహాసన్‌ అభిమానులతోపాటు యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరినీ అమితంగా అలరించే సినిమా 'గెలుపుగుర్రం'. శ్రుతిహాసన్‌ గ్లామర్ ముఖ్యంగా ఈ చిత్రంలో ఆమె యాక్ట్‌ చేసిన హాట్‌ సీన్స్‌ 'గెలుపు గుర్రం' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ పోషించిన పాత్ర వేశ్య కావడం వల్ల.. క్యారెక్టరైజేషన్‌కు తగ్గట్లుగా ఆమె చాలా బోల్డ్‌గా యాక్ట్‌ చేసింది. 
 
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రముఖ నటులు నాజర్‌ ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషించారు. 'రేసుగుర్రం' అనంతరం 'గెలుపుగుర్రం'పై వస్తున్న శ్రుతిహాసన్‌కు ఆమె ఫ్యాన్స్‌ బ్రహ్మరధం పడతారనే నమ్మకం మాకుంది. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments