Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శీలవతి' ఆగస్టు 17న వస్తోంది... అందరూ ఆదరిస్తారని కోరుతున్న షకీలా

'జీ' స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా 250 వ చిత్రంగా, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'శీలవతి'. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చితం సెన్సార్ కార్యక్రమాలన

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (14:41 IST)
'జీ' స్టూడియోస్ సమర్పణలో సెన్సేషనల్ స్టార్ షకీలా 250 వ చిత్రంగా, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'శీలవతి'. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చితం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఆగస్ట్ 17 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. "ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. ఇది నా 250వ చిత్రం. ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యమున్న పాత్రలో నటించాను. నెక్ట్స్ సీన్ ఏంటి అనే ఉత్కంఠ కలిగేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. ఆగస్ట్ 17న వస్తున్న ఈ 'శీలవతి'ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
నిర్మాతలు రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. "సెన్సార్ ట్రబుల్స్‌ని ఎదుర్కొని సక్సెస్‌ఫుల్‌గా ఆగస్ట్ 17న 'శీలవతి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. దర్శకుడు సాయిరామ్ దాసరి సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇది కేరళలో జరిగిన యథార్థ సంఘటన. ఈ సినిమా చూశాక.. ఇంతకుముందు షకీలా వేరు ఈ సినిమా తరువాత షకీలా వేరు అని అందరూ అంటారు. తప్పకుండా అందరూ సినిమా చూసి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు. 
 
షకీలా, అర్జున్(జబర్దస్త్), గీతాంజలి (ఫ్రూటీ), అశోక్, కొండ, తిరుపతి, చిన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రజ్వల్ క్రిష్, డిఓపి: తరుణ్ కరామ్ తోత్, ఎడిటర్స్: శ్రీనివాస రాజలింగు, కె ఆర్. స్వామి, నిర్మాతలు: రాఘవ ఎమ్ మహేష్, వీరు బాసింశెట్టి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సాయిరామ్ దాసరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments