Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి చిత్రాల విడుదల తేదీలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో "బాహుబలి" తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన "రంగస్థలం" లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన "అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి" చిత్రాల విడుదల తేదీలను ప్రకట

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (18:35 IST)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో "బాహుబలి" తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన "రంగస్థలం" లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన "అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి" చిత్రాల విడుదల తేదీలను ప్రకటించింది. సూపర్ హిట్ కాంబినేషన్ అయిన "రవితేజ-శ్రీనువైట్ల" కాంబోలో వస్తున్న నాలుగో సినిమా "అమర్ అక్బర్ ఆంటోనీ". ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతోంది. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేసేందుకు నిర్ణయించారు మైత్రీ మూవీ మేకర్స్. 
 
"ప్రేమమ్" లాంటి సెన్సిబుల్ లవ్ ఎంటర్‌టైనర్ అనంతరం నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "సవ్యసాచి" చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం. ఒక పాట మినహా "సవ్యసాచి" షూటింగ్ పూర్తయ్యింది. "రంగస్థలం" అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ప్రేక్షకులకు విశేషమైన నమ్మకం ఏర్పడింది.
 
అందుకే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి (CVM)లు తమ సంస్థ నుంచి రాబోతున్న తదుపరి చిత్రాల విషయంలో విశేషమైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఈ ఏడాది మాత్రమే కాదు ఎప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తామని మాట ఇస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments