Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 18 విడుదలకు సిద్ధమవుతున్న 'కిల్లింగ్‌ వీరప్పన్‌'

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2015 (20:43 IST)
తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌‌పై సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ రూపొందించిన చిత్రం 'కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్‌ సమర్పణలో జిఆర్‌ పిక్చర్స్‌ మరియు జెడ్‌ త్రీ ప్రొడక్షన్స్‌ సంస్థలపై బీవి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బిఎస్‌ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు. 'రక్త చరిత్ర', '26/11' చిత్రాల తరహాలో 'కిల్లింగ్‌ వీరప్పన్‌' చిత్రాన్ని వర్మగారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది అంటున్నారు నిర్మాతలు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మాట్లాడుతూ...'' తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్‌ని చంపడానికి పోలీసు వ్యవస్థ ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది. ఎంత డబ్బు, సమయాన్ని వెచ్చించింది అనేది వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. పోలీస్‌ ఆఫీసర్‌గా శివరాజ్‌ కుమార్‌, వీరప్పన్‌గా సందీప్‌ భరద్వాజ్‌ అద్భుతమైన నటన కనబరిచారు. ఇటీవల సెన్సార్‌ పూర్తి చేశాము. ఈ నెల 18న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నామని'' అన్నారు.
 
శివరాజ్‌ కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, యజ్ఞాశెట్టి, పరూల్‌ యాదవ్‌, రాక్‌లైన్‌ వెంకటేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రమ్మీ; సంగీతం:రవిశంకర్‌; ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ; ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సధీర్‌ చంద్ర పధిరి; నిర్మాతలు:బీవి.మంజునాథ్‌, ఇ.శివప్రకాష్‌, బిఎస్‌ సుధీంద్ర; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments