Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రాబిన్ హుడ్''గా రవితేజ: అమీ జాక్సన్‌కు నో డేట్స్.. రాశిఖన్నా ఓకే అయ్యిందా?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (13:45 IST)
టాలీవుడ్ స్టార్ రవితేజ బెంగాల్‌ టైగర్ సినిమాతో గతేడాది బిగ్గెస్ట్ హిట్‌ను దక్కించుకున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకే రాబిన్ హుడ్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. గతంలో రవితేజ సినిమాలకు రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన చక్రి చెప్పిన స్టోరీ నచ్చడంతో అతనితో సినిమా చేసేందుకు రవితేజ ఓకే చెప్పేశాడు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. 
 
రంజిత్ మూవీస్ బ్యానర్‌పై దామోదర్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ అయిన అమీ జాక్సన్‌ని హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా రోబో-2లో అమీజాక్సన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అమీజాక్సన్‌కు బిజీబిజీగా ఉండటంతో వీరి ప్రాజెక్టుకు ఓకే చెబుతుందో లేదో అనేది తెలియాలి.
 
రాబిన్ హుడ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టించే సినిమా విష‌య‌మై కాస్త జాప్యం జరుగుతోంది. సో ఈ గ్యాప్‌లో రాబిన్‌హుడ్‌లో న‌టించ‌డానికి ర‌వితేజ స‌న్నాహాలు చేసుకుంటున్నారు.
 
అలాగే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా అమీ జాక్సన్‌తో పాటు రాశిఖన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత అమీ జాక్సన్ పేరు పరిశీలించినప్పటికీ ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో రాశిఖన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments