Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహ‌బూబాతో హిట్ సాధించి ఆకాశ్ బిగ్ స్టార్‌గా ఎద‌గాలి: ప్ర‌భాస్‌(Video)

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంల

Webdunia
గురువారం, 10 మే 2018 (21:48 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ అధినేత దిల్‌ రాజు మే 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్‌కి, ఆకాశ్‌కి ఎంటైర్ యూనిట్‌కి యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల సంద‌ర్భంగా శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు. 
 
ప్ర‌భాస్ మాట్లాడుతూ ``మెహ‌బూబా ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నాకు పూరిగారు చాలా క్లోజ్‌. ఆయ‌న యుఎస్‌పి అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మీద‌నే ఉంటుంది. కానీ ఈ సినిమాలో బ్యూటీఫుల్ విజువ‌ల్స్ క‌నిపిస్తున్నాయి. వార్ బ్యాక్‌డ్రాప్‌, యుద్ధ విమానాలు అన్నీ క‌న‌ప‌డుతున్నాయి. పూరిగారికి కూడా ఫోన్ చేసి మీరేంటి ఈసారి విజువ‌ల్స్ మీద కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసిన‌ట్టున్నారు అని అన్నాను. 
 
ఆకాశ్ పూరిని సినిమాలో చూసి షాక‌య్యాను. నా బుజ్జిగాడు సినిమాలో నా యంగ్ రోల్‌ను ఆకాశ్ చేశాడు. ఈరోజు హీరోగా మ‌న ముందుకు వ‌స్తున్నాడు. త‌ను మా కుంటుంబంలోని వ్య‌క్తి. త‌ను బిగ్ స్టార్‌గా ఎద‌గాలి. త‌న పెర్ఫామెన్స్‌తో ఇంప్రెస్ అయ్యాను. త‌న వాయిస్‌, డైలాగ్ డెలివ‌రీ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. కీప్ ఇట్ అప్ ఆకాశ్‌. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. పూరి డార్లింగ్‌, ఆకాశ్ స‌హా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

వైజాగా స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ఢోకా లేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

Father: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఆపై పురుగుల మందు తాగి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments