Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 27న సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 'పిశాచి'

Webdunia
శనివారం, 14 ఫిబ్రవరి 2015 (18:17 IST)
'చంద్రకళ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన సి.కళ్యాణ్‌ తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మరో చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. మిస్కిన్‌ దర్శకత్వంలో ప్రముఖ తమిళ దర్శకుడు బాల నిర్మించిన 'పిశాసు' చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌,బ్యానర్‌పై సి.కళ్యాణ్‌ తెలుగు 'పిశాచి'గా విడుదల చేస్తున్నారు. నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, రాజ్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆశ్వథ్‌, కళ్యాణి నటరాజన్‌ నటీనటులు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలకు సిద్ధమైంది.

 
ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''తమిళ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచిన 'పిశాసు' చిత్రాన్ని తెలుగులో 'పిశాచి' పేరుతో మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27న 300 థియేటర్లలో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్స్‌కి, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల మా బేనర్‌లో రిలీజ్‌ అయిన 'చంద్రకళ' చాలా పెద్ద హిట్‌ అయింది. అదే కోవలో 'పిశాచి' కూడా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
 
బాల సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఫిబ్రవరి 27న విడుదలవుతున్న విడుదల కానున్న 'పిశాచి' చిత్రంలో నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, రాజ్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆశ్వథ్‌, కళ్యాణి నటరాజన్‌ నటీనటులు. ఈ చిత్రానికి రచన: మిస్కిన్‌, మ్యూజిక్‌: ఆరోల్‌ కొరేళి, కెమెరా: రవిరాయ్‌, నిర్మాతలు: సి.కళ్యాణ్‌, కోనేరు కల్పన, సి.వి.రావు, దర్శకత్వం: మిస్కిన్‌.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments