Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసుకు నచ్చిన వ్యక్తికోసం వెళ్లే స్త్రీ 'లజ్జ'... రెడీ...

Webdunia
సోమవారం, 11 జనవరి 2016 (19:15 IST)
తమ ప్రేమను అర్థం చేసుకోలేని భర్తతో ఇమడలేని ఓ స్త్రీ తన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే ఇతివృత్తంతో 'లజ్జ' చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని దర్శకుడు నరసింహ నంది అన్నారు. జాతీయ అంతర్జాతీయ అవార్డులను అందుకున్న '1940లో ఒక గ్రామం', 'కమలతో నా ప్రయాణం' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తాజాగా రూపొందించిన చిత్రమిది. మధుమిత, శివ, వరుణ్‌ ప్రధాన పాత్రల్లో లక్ష్మీనరసింహ సినిమా పతాకంపై బూచేపల్లి తిరుపతిరెడ్డి నిర్మించారు. కాగా ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయి విడుదలకు సిద్ధమైంది.
 
దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ... త్వరలో ఆడియోను, నెలాఖరున సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సుశీల అనే అమ్మాయి పాత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుందనీ, ఇందులో ఆ పాత్రను మధుమిత పోషించిందని చెప్పారు. సుశీలతో సహచరుడిగా జీవనం కొనసాగిస్తూ ఆమె కోసం ప్రాణమిచ్చే పాత్రలో శివ చక్కటి నటనను కనబరిచారని అన్నారు.
 
ప్రత్యేక పాత్రలో వరుణ్‌, పావని నటించారనీ, అన్ని భావోద్వేగాలున్న రొమాంటిక్‌ కమర్షియల్‌ చిత్రమిదని పేర్కొన్నారు. కాగా సుశీల అనే పరిణతి చెందిన అమ్మాయి పాత్రను ఇందులో పోషించానని మధుమతి వెల్లడించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: బుజ్జి. రఫీ, ఎ శ్రీనివాస్‌, కృష్ణి, బ్రహ్మవలి, సహ నిర్మాతలు పి.ఎల్‌కె.రెడ్డి, పాశం వెంకటేశ్వర్లు, కె. రవిబాబు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments