కీర్తి సురేష్ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (12:06 IST)
కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'గుడ్‌ల‌క్ స‌ఖి'. ఎక్కువ‌గా మ‌హిళ‌లే ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి శ్రావ్య వ‌ర్మ స‌హ నిర్మాత‌. న‌గేష్ కుకునూర్ డైరెక్ట‌ర్ చేస్తోన్న ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో నిర్మాణ‌మ‌వుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీని వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు.
 
స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఉద‌యం 10 గంట‌ల‌కు 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా క‌నిపిస్తున్నారు.
 
స్పోర్ట్స్ రామ్ కామ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ షూట‌ర్‌గా న‌టిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్రసాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ మిన‌హా మిగ‌తా ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి... గుడ్ లక్ సఖి అంటూ కీర్తి ఈసారి ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. చంద్రబాబు

చొక్కాపై చట్నీ వేసాడని అర్థరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లుతో కాల్చుతూ కత్తితో పొడిచి చంపేసారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments