Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ ఎంటర్‌టైనర్‌గా జూన్ 26న 'జాదూగాడు' విడుదల

Webdunia
మంగళవారం, 16 జూన్ 2015 (17:48 IST)
'చింతకాయల రవి' ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వంలో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’  రూపొందిస్తున్న చిత్రం 'జాదూగాడు'. ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య',లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’ ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హరహర మహాదేవ’ సీరియల్‌లో పార్వతిగా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.  
  
'జాదూగాడు' చిత్ర దర్శకుడు 'యోగేష్' మాట్లాడుతూ..' కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమకధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రంలో అతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. లోన్ రికవరీ బిజినెస్ చేసే పాత్రలో ఈ చిత్ర కధానాయకుడు కనిపిస్తారు. కధానాయిక సోనారికతో ప్రేమలోపడ్డ తరువాత లోకల్ గ్యాంగ్ లీడర్‌తో కథానాయకుడి వివాదం ఇటు కథను, అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నది చిత్రమని, మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రంలో కధానాయకుడి పాత్రను తీర్చిదిద్దటం జరిగిందని, వినోదంతో కూడిన మాస్ కథా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు దర్శకుడు.
 
'జాదూగాడు' జూన్ 26 న విడుదల: పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’  చిత్రం ను జూన్ 26 న విడుదల చేయ నున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు సాగర్ మహతి సంగీతం ఈ చిత్ర విజయానికి ఓ మెట్టు అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు. ప్రధాన  తారాగణం : కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు.
 
సాంకేతిక వర్గం : సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ ,ఎడిటర్: యం.ఆర్.వర్మ: ఆర్ట్ : సాహి సురేష్ ; ఫైట్స్ : వెంకట్ ; కథ , మాటలు : మధు సూదన్; పాటలు : వరికుప్పల యాదగిరి , శ్రీమణి, విశ్వ. నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : యోగేష్ 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments