Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిన క్వీన్ రీమేక్‌: రేవతి డైరక్షన్, సుహాసిని డైలాగ్స్.. కంగనా రనౌత్?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (16:38 IST)
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన క్వీన్ మూవీని రిమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్‌కు స్టార్ స్టేటస్ అందించిన ఈ సినిమాను.. సౌత్‌లోకి రీమేక్ చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. దీనికి సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహించనున్నట్లు సినీప్రముఖులు అంటున్నారు. ఇప్పటికే మిత్ర్ - మై ఫ్రెండ్, ఫిర్ మిలేంగే వంటి చిత్రాలకు డైరెక్షన్ చేసిన రేవతి.. ఈ క్వీన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్యాగరాజన్ నిర్మించనున్న క్వీన్ రీమేక్‌కు.. సీనియర్ నటి సుహాసిని తెలుగు, తమిళ భాషల్లో మాటలు రాస్తుండడం ఇంకో విశేషం. 
 
అసలు కథ ఏంటంటే పెళ్లికి ముందు రోజు వివాహం ఆగిపోతే.. ముందుగా హనీమూన్ కోసం బుక్ చేయించుకున్నటికెట్లపై వెకేషన్‌కి వెళ్లిన అమ్మాయి కథే ఈ క్వీన్. పారిస్ టూర్‌లో ఆమె ఎదుర్కున్న పరిస్థితులు తనలో వచ్చే మార్పు, కొత్త పరిచయాలు ఆ తర్వాత పెళ్లిని రద్దు చేసిన వ్యక్తి వచ్చి క్షమించమని అడగడం హీరోయిన్ తిరస్కరించడం.. ఇదీ స్టోరీ లైన్. సాధారణంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఎప్పుడూ ప్రజాదరణ పొందడంతో ఏ భాషలో అయినా ఈ చిత్రం క్లిక్ అవుతుందనే అంచనాలున్నాయి. 
 
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ వర్క్‌ను సుహాసిని పూర్తి చేశారట. మరికొన్ని నెలల్లో సెకండాఫ్ కూడా ఫినిష్ చేస్తారని ఈ ఏడాదిలో ఈ చిత్రం తెరపైకి వెళ్లనుందని రేవతి అంటున్నారు. ఇద్దరు సీనియర్ నటీమణులు కలిసి రూపొందించే చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక హీరోయిన్‌గా కంగనా రనౌత్‌నే దక్షిణాదిన క్వీన్ రీమేక్‌లో నటింపజేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments