Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు `అర‌కు రోడ్‌లో`

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `అర‌కు రోడ్‌లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కాలు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మ

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (19:20 IST)
రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `అర‌కు రోడ్‌లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కాలు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలన్ని పూర్తిచేసుకుని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భం గా చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
 
దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల "మా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాద్ గారు, మరియు ఇతర సినీ ప్రముఖులు ప్రసాద్ ల్యాబ్లో చూడడం జరిగింది. సినిమా చూసిన వారందరూ మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. 30 ఇయర్స్ పృద్వి చేసిన రిస్క్ రసూల్ క్యారక్టర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పారు. 500 మరియు 1000 రూపాయల నోట్ల రద్దుతో సినిమా ధియేటర్‌లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినప్పటికీ మా సినిమా "అరకు రోడ్‌లో "మీద వున్న నమ్మకంతో  ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2న అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేయనున్నాము అని అన్నారు.
 
ఈ సమావేశంలో హీరో రాం శంక‌ర్‌, హీరోయిన్ నికిషా ప‌టేల్, దర్శకుడు వాసుదేవ్, మేకా బాలసుబ్రహ్మణ్యం, మేకా సింహాద్రి, వేగిరాజు ప్రసాద రాజు, విజయ్ నక్కా, కెమెరామాన్ జగదీశ్ చీకటి పాల్గొన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం: వాసుదేవ్.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments