Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో వస్తున్న "అంజనీ పుత్రుడు"

Webdunia
నాగేంద్రబాబు, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా వినాయక ఫిలింస్ పతాకంపై కె. చంద్రశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం "అంజనీ పుత్రుడు". సాయి రమేష్, శేఖర్ కల్లూర్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఈ సినిమా టాకీ పూర్తయిందని, క్లైమాక్స్‌ను ఫిలింసిటిలో చిత్రిస్తున్నామన్నారు. నాగేంద్రబాబు అగోరాలపై ఒక ఫైట్‌ను అత్యద్భుతంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రించామని తెలిపారు. దీంతో రెండు పాటల మినహా చిత్రం పూర్తవుతుందని వెల్లడించారు.

సహ నిర్మాతలు మాట్లాడుతూ... చక్కని సోషియో ఫాంటసీ చిత్రమిదని, ఇందులో చైల్డ్ సెంటిమెంట్ కూడా ఉందన్నారు. మాంత్రికుడిగా రామిరెడ్డి నటిస్తున్నారని, దీపావళితో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి నవంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో ప్రేమ, శేఖర్ కల్లూర్, రామిరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ కృష్ణ, అపూర్వ, ప్రాచి, రామాంజనేయులు, బల్వాన్ హేమ సుందర్, మాస్టర్ భరత్, మాస్టర్ సుమంత్ రాజ్, బేబి యామిని తదితరులు నటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

పరిచయం ఉన్న అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయలేదన్న అక్కసుతో ఆమె భర్తను హత్య...

పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దు

జేఎన్ఐఎం జిహాదీ గ్రూపు భీకరదాడి.. 100మందికి పైగా బలి

భారత్ బ్రహ్మోస్ దెబ్బకు బంకర్లలోకి పారిపోయి దాక్కొన్న పాక్ ఆర్మీ చీఫ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments