Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడి తలపై అరజుట్టు అదృశ్యమైంది... సన్నాఫ్ సత్యమూర్తి స్టయిలులో...

Webdunia
సోమవారం, 20 జులై 2015 (18:37 IST)
అప్పుడే పుట్టాడు చిన్నారి
వెంటనే పరుగెట్టాడు నాన్నారు
ఎక్కడికిరా భడవా అన్నారు తాతారు
సంటోడికి ఎల్కేజీ సీటు కోసం అంది బామ్మారు
 
బడిలో ఎల్కేజీ దరఖాస్తూ క్యూ
నింపినదివ్వడానికి మరో క్యూ
సంటోడికి నాలుగో ఏటకు సీటు
50 వేలు అడ్వాన్సు బుకింగ్
 
కౌంటర్ కింగ్ క్వచ్చన్ మార్క్
పచ్చనోట్లు జమకు రెడీ
చంటోడి సీటు కన్ఫర్మ్
ఇదిగో రశీదు... నాలుగేళ్లూ జాగ్రత్త మేస్టారూ
 
ఇంటికొస్తే చంటోడి చిర్నవ్వు
నాలుగేళ్లూ ఏడుస్తూనే ఎల్కేజీకి
1,2,3,4,5,6,7,8,9
ఫౌండేషన్ కోర్సు, ఎందుకనడగరే ఐఐటీకి
ఎంతనడగరే, 2 లక్షలు తెచ్చుకో
మీవాడి జాతకం మా కోర్సుతోనే
 
అబ్బో... చాలా చమురు, దొరుకుతుందా
చేర్చేద్దామండీ, శ్రీమతి పిలుపు
నా స్నేహితుడూ అదే నాన్నా
పుత్నరత్నం పలుకరింపు
చమురు వదిలింది...
అప్పు మిగిలింది
 
సంటోడి బండి సిత్రంగా దూసుకెళ్లింది
+1, +2 ముగిసింది, 
వాడి తలపై అరజుట్టు అదృశ్యమైంది...
సన్నాఫ్ సత్యమూర్తి స్టయిలులో
వాడి నాన్నకు నెత్తిపై అర ఎకరా పోయింది... టెన్షనుతో...
 
ఫౌండేషన్ కోర్సు పాలిపోయింది
ఫలితాల్లో చంటోడి పేరు పారిపోయింది
బీటెక్ కోర్సు వాలిపోయింది...
ఎంతేంటి కన్నా, రెండు ఎనిమిదులు పదహారు
కుదరదు చిన్నా, నాన్న గొణుగుడు
నా జీవితం నాన్నా, పుత్రుడు అరుపు
 
అప్పు ముదిరింది, అబ్బాయి చదువు ముగిసింది
పెళ్లి కుదిరింది, ఫారిన్ సెటిలైంది
అమ్మానాన్నార్లు ఓల్డేజ్ హోముకు
కొత్త పెళ్లి కూతురుతో విమానంలో చిన్నోడు ఫారిన్‌కు...
 
                                                             -  యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?

Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Show comments