Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త - పాత నిర్మాతలకు కొంగు బంగారం జినీవర్స్

డీవీ
గురువారం, 1 ఆగస్టు 2024 (14:08 IST)
zineeverse
ఓ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేవి... కళ్ళు చెదిరే సెట్టింగ్స్, కళకళలాడే తారాగణం, ఫారిన్ లొకేషన్స్ కానే కాదు. ఓ సినిమా విజయాన్ని శాసించేవి.. కథ-కథనాలు, ప్రణాళికాబద్ధ నిర్మాణ దక్షత మాత్రమే. 
 
ముఖ్యంగా... నిర్మాతలుగా తమదైన ముద్ర వేయాలనే తహతహతో... ఈ రంగంలోకి అరంగేట్రం చేసే కొత్త నిర్మాతలు... సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడి, తీవ్రంగా నష్టపోతున్నారు. వారు నష్టపోతున్నది కోట్లాది రూపాయల తమ కష్టార్జితాన్ని మాత్రమే కాదు, రేయింబవళ్లు శ్రమించి, తమ రంగంలో కూడబెట్టుకున్న పేరు ప్రతిష్టలు కూడా.
 
సినిమా విజయాన్ని శాసించే కథ - కథనాల ఎంపికలో కొత్తవాళ్లకు మాత్రమే కాకుండా... ఈ రంగంలో అనుభవజ్ఞులైన సీనియర్ నిర్మాతలకు కూడా ఉపకరించేందుకు " జినీవర్స్ " నడుం కట్టింది!!
 
సినిమా రంగంలో రచన - దర్శకత్వం - నిర్మాణం - పంపిణీ వంటి విభాగాల్లో అపారమైన అనుభవం కలిగినవారితోపాటు, మార్కెటింగ్ - ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ వంటి అంశాల పట్ల సైతం విశేష అనుభవం కలిగినవారిని ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి, బౌండెడ్ స్క్రిప్ట్‌తోపాటు... ఒక డెమో ఫిల్మ్‌ను నిర్మాతలకు అందించే ఓ బృహత్ ప్రణాలికను జినీ జినీవర్స్ సిద్ధం చేసింది. 
 
భారతీయ సినిమా చరిత్రలోనే ప్రప్రథమమైన విశిష్ట ప్రక్రియ ఇది. పద్మవ్యూహం లాంటి సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు... దాన్నుంచి విజయవంతంగా బయటకు రావడం నేర్చుకోవాలనే ఔత్సాహిక నిర్మాతలు, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కథలను ఎంపిక చేసుకుని ఈ పర్యాయం ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టి తీరాలని తీర్మానించుకున్న సీనియర్ నిర్మాతలకు జినీవర్స్ ఓ కొంగు బంగారమని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. సినిమా రంగంలో సుదీర్ఘమైన అనుభవంతోపాటు... సమర్ధత, విశ్వసనీయతలకు మారుపేరైన ఎన్.బల్వంత్ సింగ్ జినీవర్స్ కు సారధ్యం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పేడెక్స్ మిషన్: భారత్‌కు ఈ ప్రయోగం ఎందుకంత కీలకం?

గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంట్రాక్టర్ల వ్యవస్థను జగన్ చంపేశారు : ఆర్థిక మంత్రి పయ్యావుల

అరే... పేర్ని నాని నీ బ్యాటరీ సరిగ్గా లేదు... పవన్ మంచోడు కాబట్టే.. : జేసీ ప్రభాకర్ రెడ్డి (Video)

తూగోలో రేవ్ కలకలం... ఐదుగురు అమ్మాయిలతో 14 మంది పురుషుల పార్టీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments