Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్ 2 టీజర్‌పై యూ ట్యూబ్ కాంట్రవర్సీ

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (17:50 IST)
Adivi Shesh
వెర్సటైల్ రోల్స్ చేస్తూ తనదైన గుర్తింపు, క్రేజ్‌ను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. డిసెంబర్ 2న సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతుంది. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నాని స‌మ‌ర్ప‌కుడిగా వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌. 
 
ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ‌చింది. అతి త‌క్కువ వ్య‌వ‌ధిలోనే యూ ట్యూబ్ స‌హా అన్నీ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ‘హిట్ 2’ టీజ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తూ ట్రెండ్ అయ్యింది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. 
 
అయితే యూ ట్యూబ్ ‘హిట్ 2’ టీజ‌ర్‌ను తొల‌గించి అంద‌రికీ షాకిచ్చింది. ట్రెండింగ్ లిస్టు నుంచి తొల‌గించింది. టీజ‌ర్ చూడ‌టానికి వ‌యోప‌రిమితి ఉండాలంటూ ఆంక్ష‌లు విధించింది. టీజ‌ర్‌పై యూ ట్యూబ్ యాక్ష‌న్ తీసుకునే లోపు 9 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.  దీనిపై హీరో అడివి శేష్ వివ‌ర‌ణ ఇస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని వివరిస్తూనే టీజ‌ర్‌ను చూడాల‌నుకుంటే ఏం చేయాలో కూడా చెప్పారు. 
 
ఇలాంటిది ముందే జ‌రుగుతుంద‌ని టీమ్ ముందుగానే ఊహించింది. అయితే అంతా స‌వ్యంగానే జ‌రుగుతుంద‌ని యూనిట్ భావిస్తోంది. యూ ట్యూబ్ నిర్ణ‌యాన్ని చిత్ర యూనిట్ స్వాగ‌తించింది. అదే స‌మ‌యంలో అడివి శేష్ త‌న వీడియోలో రేపు విడుద‌ల‌వుతున్న ఉరికే ఉరికే సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరారు. గ్యారీ బి.హెచ్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments