వినయ విధేయ రామ సినిమా ఎలా తీశానో తెలుసా? సీక్రెట్ బ‌య‌టపెట్టిన‌ బోయ‌పాటి శ్రీను

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (17:33 IST)
భ‌ద్ర‌, తుల‌సి, సింహా, ద‌మ్ము, లెజెండ్, స‌రైనోడు, జ‌య జాన‌కి నాయ‌క‌.. ఇలా భారీ చిత్రాల‌ను త‌న‌దైన శైలిలో తెర‌కెక్కించి విజ‌యాలు సాధిస్తోన్న ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో బోయ‌పాటి విన‌య విధేయ రామ అనే సినిమాని తెర‌కెక్కించారు. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దాన‌య్య నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ఇవాళ 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.
 
ఈ సంద‌ర్భంగా బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ… వినయ విధేయ రామ విజన్ నుండి విజువల్ వరకు ఉన్న మెయిన్ కనెక్టివిటీ రామ్ చరణ్. ఆయన లేకపోతే ఇది సాధ్యపడేది కాదు. సినిమా అంటే పండుగ‌. పండుగ‌ని అభిమానుల వరకు చేర్చాలంటే ఆర్టిస్ట్ నన్ను నమ్మాలి. వాళ్ళు నన్ను నమ్మాలంటే వాళ్ళ కన్నా ముందు నేను పదింతలు ఎక్సర్‌సైజు చేసి, వాళ్ళను ఇన్స్‌పైర్ చేయగలగాలి. ఈ ప్రాసెస్‌లో ఆర్టిస్టుల కన్నా కథలో నేనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను. కథ చెప్పేటప్పుడే ఎఫెక్ట్స్‌తో సహా ఎక్స్‌ప్లేన్ చేస్తాను.
 
మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు ఒక కొత్త పాయింట్‌ని విన‌య విధేయ రామ‌లో రైజ్ చేశాం. అది ఆడియెన్స్‌కి రీచ్ అవుతుంది అన్నారు. వ‌రుస‌గా హిట్స్ ఇస్తున్నారు ఏంటి సీక్రెట్ అని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా... ఏ హీరోతో సినిమా చేస్తే.. ఆ హీరోకి అభిమానినై చేస్తా. చరణ్ కోసం సినిమా రాసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుని చూస్తున్నట్టుగా ఫీలై కథ రాసుకున్నా. ప్రతి హీరోకి అదే చేస్తా. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments