''అజ్ఞాతవాసి'' అరుదైన రికార్డ్- ''ఎవడు-3''గా యూట్యూబ్‌లో..?

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (16:26 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, కీర్తిసురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన సినిమా ''అజ్ఞాతవాసి''. ఈ సినిమా పవన్ కెరీర్‌లో చెత్త సినిమాగా నిలిచిపోయింది. దర్శకుడు త్రివిక్రమ్ ఇంత వరకు సంపాదించుకున్న బ్రాండ్ నేమ్ అజ్ఞాతవాసి సినిమాతో చెల్లాచెదురైపోయింది. అయితే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన ఈ చిత్రం యూట్యూబ్‌లో మాత్రం దూసుకుపోతోంది. 
 
ఆ రికార్డు సంగతికి వస్తే.. చెర్రీ, వంశీపైడిపల్లి కాంబోలో వచ్చిన ''ఎవడు''ను అదే పేరుతో హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సినిమా హక్కులను గోల్డ్‌మైన్ టెలీఫిలిమ్ సంస్థే కొనుగోలు చేసింది. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే సినిమాను ఎవడు-2 పేరుతో ఇదే సంస్థ హిందీలో విడుదల చేసింది. ఈ రెండు సినిమాలు పది మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. ప్రస్తుతం ఇదే ఎవడు పేరుతో.. ఎవడు-3గా అజ్ఞాతవాసిని విడుదల చేశారు.
 
బయ్యర్లకు నష్టాన్ని మాత్రమే మిగిల్చిన ఈ చిత్రం ఆన్‌లైన్‌లో మాత్రం ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ''అజ్ఞాతవాసి'' సినిమా హిందీ డబ్బింగ్ ఎవడు-3 పేరిట ఆన్‌లైన్‌ల విడుదల చేయగా, రెండు రోజుల్లో 2 కోట్ల మంది సినిమాను చూశారు. ఓ దక్షిణాది చిత్రం హిందీలోకి డబ్ అయి, 48 గంటల్లోనే ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ విధంగా పవన్ ''అజ్ఞాతవాసి'' ఓ అరుదైన రికార్డును సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments