Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో నటి దివ్యా భట్నాగర్ మృతి.. అధిక రక్తపోటుతో ఆస్పత్రికి వెళ్లి..?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (10:45 IST)
Divya
టీవీ ప్రముఖ నటి దివ్యా భట్నాగర్ (34) సోమవారం ఉదయం కరోనాతో ముంబై నగరంలోని సెవెన్ హిల్సు ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం టీవీ నటి దివ్యాభట్నాగర్‌కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. 
 
హైబీపీ సమస్యతో బాధపడుతున్న దివ్యా భట్నాగర్‌కు కరోనా సోకి గత నెల ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తపోటుతోపాటు నిమోనియాతో బాధపడుతున్న దివ్యాకు వైద్యులు వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందించారు. 
 
తేరే యార్ హూ మైనే షూటింగులో నుంచి దివ్యా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. దివ్యా యే రిష్టా క్యా కహలేతా హై, సంస్కార్, సన్వారీ సబ్ కో ప్రీతో షోలలో దివ్యా పాల్గొన్నారు. ఈమె ఎక్కువగా టీవీ సీరియళ్లలో నటించింది. ఏ రిస్తా క్యా ఖేల్తా హై అనే సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఈ నటి గత నెల చివరిలో కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆమెకు వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే సోమవారం తెల్లవారు జామున మరణించినట్లుగా సమాచారం అందుతోంది. ఆసుపత్రిలో చేర్చిన సమయంలో దివ్య తల్లి మాట్లాడుతూ వారంరోజులుగా దివ్య జ్వరంతో బాధ పడుతోందని ఆక్సీ మీటర్ తో చెక్ చేస్తే ఆమె ఆక్సిజన్ 71కి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్‌కి తరలించారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments