Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథే యాత్ర 2 : మహి వి రాఘవ్

డీవీ
శుక్రవారం, 5 జనవరి 2024 (15:12 IST)
Mammootty, Jeeva
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మేకర్స్ ‘యాత్ర 2’ టీజర్‌ను విడుదల చేశారు. 
 
టీజర్‌ను గమనిస్తే...వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అదే సందర్భంలో తండ్రిలాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు.  అయితే ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమనించారు.. తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే ‘యాత్ర 2’ సినిమా. 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు డైరెక్టర్ మహి. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. 
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర  ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా ‘యాత్ర 2’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. యాత్ర సినిమాను  ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. 
 
ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments