Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి కాదు దాని అమ్మమ్మ లాంటి సినిమా.. 3 రోజుల్లో రూ.1435 కోట్లు, వారంలో రూ.2,700 కోట్లు

ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమా తొలి మూడురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేస్తే బాలీవుడ్ అదిరిపోయింది. హాలీవుడ్‌లో కూడా అది సంచలన వార్త అయింది. కానీ బాహుబలి కాదు దాని అమ్మమ్మ లాంట

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (09:09 IST)
ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమా తొలి మూడురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేస్తే   బాలీవుడ్ అదిరిపోయింది. హాలీవుడ్‌లో కూడా  అది సంచలన వార్త అయింది. కానీ బాహుబలి కాదు దాని అమ్మమ్మ లాంటి సినిమా ఇప్పుడు హాలీవుడ్‌ని మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల దుమ్మురేపుతోంది.  పురుషాధిక్యత ప్రబలిపోయిన ప్రపంచ చిత్ర పరిశ్రమలో ఒక లేడీ డైరెక్టర్ తీయగా ఒక హీరోయిన్ లీడ్ రోల్ పోషించిన ఆ సినిమా ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని రికార్డులను సృష్టిస్తూ సంచలనం కలిగిస్తోంది. 3 రోజుల్లో రూ.1435 కోట్లు, వారంలో రూ.2,700 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ఈ చిత్రం ఇటీవల విడుదల అయిన అన్ని హాలీవుడ్ చిత్రాలన కలెక్షన్లను తుడిచిపెట్టేసింది.
 
వారం క్రితం విడుదలైన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘వండర్‌ వుమన్’.. బాక్సాఫీస్‌ వద్ద వండర్స్‌ సృష్టిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 223 మిలియన్ డాలర్లు (రూ. 1435 కోట్లు) వసూలు చేసిన ఈ సినిమా వారంలో 420 మిలియన్ డాలర్లు (రూ. 2700) వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పేరుపొందిన స్టార్లు లేకపోయినా, ఒక లేడీ డైరెక్టర్‌ రూపొందించిన ఒక హీరోయిన్ ఓరియంటెడ్‌ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. 
 
2003లో తీసిన ‘మాన్ స్టర్‌’ తర్వాత ప్యాటీ జెన్ కిన్స్ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ను గల్‌ గదోత పోషించింది. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు సుపరిచితురాలైన గల్‌.. నిరుడు వచ్చిన ‘బ్యాట్‌మ్యాన్ వర్సెస్‌ సూపర్‌మ్యాన్’ సినిమాలో తొలిసారిగా వండర్‌ వుమన్ డయానా ప్రిన్స్ కేరక్టర్‌ చేసింది. రానున్న ‘జస్టిస్‌ లీగ్‌’లోనూ ఇదే పాత్రలో కనిపించనుంది. 
 
మొత్తానికి ‘వండర్‌ వుమన్’ దెబ్బకు ప్రియాంకా చోప్రా నటించిన ‘బేవాచ్’ బాక్సాఫీస్‌ వద్ద నిండా మునిగిపోగా, టామ్‌ క్రూయిస్‌ వంటి సూపర్‌స్టార్‌ నటించిన ‘ద మమ్మీ’ సైతం రెండో స్థానానికి పడిపోయింది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments