Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి : నటి మాధవీలత

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (13:32 IST)
ఆపదలో ఉన్న అభిమానులకు సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కు తినాల్సి వస్తుందని సినీ నటి మాధవీలత అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన వీరాభిమాని కౌశిక్ కేన్సర్‌ వ్యాధితో పోరాడుతుండగా అతడి కోరిక మేరకు గతంలో తారక్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ సమయంలో యంగ్ టైగర్ అతని చికిత్సకు సాయం చేస్తానని కౌశిక్ తల్లితో చెప్పారు. 
 
అయితే, అప్పుడు కౌశిక్ తల్లి ఎన్టీఆర్‌పై ఆరోపణలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తారక్ అపుడు సాయం చేస్తానని మాటిచ్చి, ఇపుడు స్పందించడం లేదంటూ సంచలన ఆరోపణలు చేయడం ఆ వీడియోలో వుంది. కేవలం ఆయన ఫ్యాన్స్ నుంచి మాత్రమే తమకు కొంతమేర సాయం అందిందని ఆమె పేర్కొన్నారు. 
 
మరోవైపు, నెట్టింట వైరల్ అయిన వీడియోపై హీరోయిన్ మాధవీలత తీవ్రంగా స్పందించారు. ఈ రకంగా ఫ్యాన్స్‌కి డబ్బులు ఇచ్చుకుంటూ  పోతే హీరోలు అడుక్కుతినాలన్నారు. ఆశించేవాళ్లు అభిమానులు ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. 
 
"అయితే, ఏం చేద్దాం. ఈ రకంగా ఫ్యాన్స్‌కి డబ్బులిస్తూ పోతే హీరోలు రోడ్డునపడి అడుక్కుతినాలి. అభిమాని అంటే ఆశించే వాడు కాదు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం. ఆశిస్తే అర్థం అవుద్ది. కానీ, అభిమానం ఎలా అవుద్ధి. రోజుకొకరు మాకు సాయం చేయమని బయటికి వస్తారు. కథలు పట్టుకుని ఫిల్మ్ నగర్‌లో చాలా మంది తిరుగుతుంటారు. అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది" అని మాధవీలత తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments