Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' నిర్మాతనని చెప్పి మహిళా న్యాయవాదికి టోకరా

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (15:53 IST)
దర్శధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ  చిత్రం వచ్చే యేడాది జూలై ఆఖరులో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుమారుగా రూ.250 నుంచి రూ.300 కోట్ల మేరకు ఖర్చు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 
 
అయితే, ఈ చిత్రంలో తల్లిపాత్రలో వేషం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళా న్యా యవాదిని ఓ వ్యక్తి మోసం చేశాడు. అదీకూడా తాను ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతనంటూ నమ్మించి రూ.50 లక్షల మేరకు టోకరా పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఓ కలర్ ల్యాబ్‌లో వీరబత్తిన నరేష్ కుమార్ పని చేస్తున్నాడు. ఈయన బోయిన్‌పల్లికి చెందిన 73 యేళ్ల వయస్సున్న మహిళా న్యాయవాదితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత తాను ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతనని చెప్పి ఆమెను నమ్మించాడు. పైగా, రాజమౌళితో మాట్లాడి ఆర్ఆర్ఆర్ చిత్రంలో తల్లిపాత్ర వేషం ఇప్పిస్తానని చెప్పడంతో ఆమె నమ్మేసింది. 
 
ఇలా గత నాలుగు నెలల్లో రూ.50 లక్షలను లాగేశాడు. ఆ తర్వాత షూటింగ్‌కు ఎపుడు తీసుకెళుతున్నారని ఆ మహిళా న్యాయవాది ప్రశ్నించడంతో నరేష్ కుమార్ ఎదురుదాడికి దిగాడు. పైగా, ఫోన్ స్వీచాఫ్ చేశాడు. దీంతో ఆమె బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మోసగాడికోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments