Webdunia - Bharat's app for daily news and videos

Install App

విన్నర్ ట్రైలర్‌కు యమా క్రేజ్.. 1 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్ (ట్రైలర్)

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, తిక్క, సుప్రీమ్ వంటి సినిమాలతో టాలీవుడ్ మెగా హీరోగా ముద్ర వేసుకున్న సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు. మెగాస

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (15:29 IST)
రేయ్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, తిక్క, సుప్రీమ్ వంటి సినిమాలతో టాలీవుడ్ మెగా హీరోగా ముద్ర వేసుకున్న సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు. మెగాస్టార్ చిరంజీవి, మామయ్య పండుగ ముందే ఖైదీ నెంబర్‌ 150గా ప్రేక్షకుల ముందుకు వస్తే మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ...సంక్రాంతి పండుగ రోజున ట్రైలర్‌తో శుభాకాంక్షలు తెలిపాడు. 
 
‘నీలాంటి వాళ్లు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు అరుదుగా ఉంటారు. అదే డేట్‌, అదే ప్లేస్‌, అదే టైమ్‌, అదే ట్రాక్‌, అదే రేంజ్‌, నేను రెడీ’ అంటూ సాయిధరమ్‌ ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌ ఫెర‍్మామ్మెన్స్‌తో హల్‌ చల్‌ చేశాడు. త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి `విన్న‌ర్‌`గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర కథ 
 
దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన 'విన్నర్‌' ఫస్ట్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), టాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వచ్చే నెల 24న విన్నర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సాయిధరమ్‌ తన ట్విట్టర్‌లో ట్రైలర్‌ను పోస్ట్ చేశాడు.

 
 
ఈ ట్రైలర్‌ను ఇప్పటికే 1 మిలియన్ మంది చూశారు. అంతేగాకుండా విన్నర్ లుక్ పట్ల సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షేర్లు కూడా పిచ్చ పిచ్చగా పెరిగిపోతున్నాయి. దీంతో సాయి ధరమ్ తేజ ఖాతాలో మరో హిట్ కూడా చేరే అవకాశం ఉందని సినీ పండితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments