Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డు దిశగా 'రంగస్థలం' .. చిరంజీవి రికార్డు బ్రేక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌కాగా, జగపతిబాబు, ఆది పిని

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:37 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌కాగా, జగపతిబాబు, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, అనసూయ, పూజా హెగ్డే తదితరులు నటించారు.
 
అయితే, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమా హిట్‌తో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో ఈ సినిమా రూ.128 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. 10 రోజులు పూర్తయ్యేనాటికి ఈ సినిమా రూ.147.10 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇంతకుముందు రూ.144.55 కోట్లను వసూలు చేసి రికార్డును సెట్ చేసిన 'శ్రీమంతుడు'ను అధిగమించింది.
 
దీంతో రంగస్థలం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరేందుకు మరెన్నో రోజులు పట్టదని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం, 'బాహుబలి'ని పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా 'మగధీర' రూ.150 కోట్లను.. 'ఖైదీ నంబర్ 150' రూ.164 కోట్లను వసూలు చేసి రికార్డులు సృష్టించాయి. ఇపుడు ఈ రంగస్థలం మున్ముందు ఈ రెండు చిత్రాల రికార్డులను చెరివేసే దిశగా దూసుకెళుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments