Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకున్నా.. పవన్‌తో టచ్‌లో ఉంటా : రేణూ దేశాయ్

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. వాస్తవానికి ఈమె పవన్‌తో కలిసి సహజీవనం చేయగా, వీరికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (12:58 IST)
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. వాస్తవానికి ఈమె పవన్‌తో కలిసి సహజీవనం చేయగా, వీరికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పిల్లలు మాత్రం రేణూ వద్దే ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో రేణూ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇద్దరు పిల్లలను పవన్ తన వద్దకు పిలిపించుకున్నారు.
 
ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్‌పై రేణూ దేశాయ్ స్పందించింది. తన పిల్లల కోసం పవన్‌తో టచ్‌లో ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చింది. ఆయన అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకి తండ్రి. వారి భవిష్యత్ కోసం తప్పక టచ్‌లో ఉండాల్సిందే. సెలవులు వచ్చినప్పుడు, లేదా ఏవైన వేడుకలు ఉన్నప్పుడు అకీరా, ఆద్యాలు తప్పక ఆయన దగ్గరకు వెళతారు, నా వద్దకూ వస్తారు అని చెప్పుకొచ్చింది. రేణూ మాటలతో అభిమానులలో ఉన్న పలు అనుమానాలు తొలగిపోయినట్టు అయింది.
 
కాగా, రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ, తన రెండో మ్యారేజ్ ప్రకటన చేసినప్పటి నుండి రేణూకి ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోల్స్ రావడంతో ఆమె తన తన ట్విట్టర్ ఖాతాని తాజాగా క్లోజ్ చేసింది. ఆమెని ఎంతగానో అభిమానించే అభిమానులు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూతో టచ్‌లో ఉంటూనే ఉన్నారు. అయితే, ఓ అభిమాని పెళ్లి తర్వాత కూడా మీరు పవన్‌తో టచ్‌లో ఉంటారా అని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments