Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ డైరెక్టర్‌తో చైతన్య మూవీ చేయనున్నాడా?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:44 IST)
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ మూవీ చేస్తున్నారు. ఇందులో చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. మజిలీ, వెంకీమామ చిత్రాల తర్వాత చైతన్య చేస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత చైతన్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో థ్యాంక్యూ అనే సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించనున్నారు. దసరా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలావుంటే.. నాగచైతన్య తమ్ముడు అఖిల్‌తో సినిమా చేసిన డైరెక్టర్‌తో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
ఇంతకీ.. ఎవరా డైరెక్టర్ అంటారా..? అఖిల్‌తో మిస్టర్ మజ్ను సినిమా తెరకెక్కించిన వెంకీ అట్లూరి. అవును.. వెంకీ అట్లూరి నాగచైతన్య కోసం స్పోర్ట్స్ డ్రామా రెడీ చేసాడట. రీసెంట్‌గా వెంకీ అట్లూరి నాగచైతన్యకు కథ చెప్పాడని.. ఈ కథ విని నాగచైతన్య పాజిటివ్‌గా స్పందించాడని తెలిసింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. వెంకీ అట్లూరి ప్రస్తుతం నితిన్‌తో రంగ్ దే సినిమా చేస్తున్నాడు.
 
 ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అయితే.. నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ చేస్తున్నారు. ఆ తర్వాత థ్యాంక్యూ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత ఇంద్రగంటితో సినిమా, నందినీరెడ్డితో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మరి.. వెంకీ అట్లూరితో సినిమాని ఓకే చేస్తాడా..? ఓకే చేస్తే.. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు..? ఇవన్నీ క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments