Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై కట్టప్పా కిల్డ్ బాహుబలి కాదు.. వై శ్రీదేవి రిజెక్ట్ శివగామి పాత్ర.. ఇదే ఇప్పటి కొత్త ప్రశ్న

బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు మొదట్లో శ్రీదేవిని తీసుకోవాలనుకున్న రాజమౌళి ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిండంతో ఆశాభంగం చెందాడు కానీ ఆ తర్వాత తన తండ్రి విజయేంద్రప్రసాద్ మాటను పాటించి రమ్యకృష్ణను ఎంచుకోవడం బాహుబలి చరిత్రనే మార్చి పడేసింది. భారత చలన చిత్

Webdunia
శనివారం, 6 మే 2017 (09:01 IST)
అంతా మనమంచికే అనే విషయం రాజమౌళి విషయంలో జరిగినంతగా మరెవరికీ సాధ్యమై ఉండదని ఇప్పుడు లేటెస్ట్ టాక్.. బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు మొదట్లో శ్రీదేవిని తీసుకోవాలనుకున్న రాజమౌళి ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిండంతో ఆశాభంగం చెందాడు కానీ ఆ తర్వాత తన తండ్రి విజయేంద్రప్రసాద్ మాటను పాటించి రమ్యకృష్ణను ఎంచుకోవడం బాహుబలి చరిత్రనే మార్చి పడేసింది. భారత చలన చిత్ర చరిత్రలోనే ఇంతటి శక్తివంతమైన మహిళా పాత్ర లేదనేంత రేంజిలో శివగామి పాత్రను రమ్యకృష్ణ దున్ని పడేసింది. అది రాజమౌళి లక్ అని కొందరంటే మరికొందరు మరోబలమైన ప్రశ్న వేస్తున్నారు. వై కట్టప్పా కిల్డ్ బాహుబలి కాదు.. వై శ్రీదేవి రిజెక్ట్ శివగామి పాత్ర.. ఇదే ఇప్పటి కొత్త ప్రశ్న. 
 
బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. రెండు భాగాల్లోను కూడా హీరో, విలన్లతో సమాన స్థాయిలో ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రలో రమ్యకృష్ణ జీవించారు. ఆమె తమ సినిమాకు ఓ ఎసెట్ అని స్వయంగా రాజమౌళి కూడా చెప్పారు. అయితే.. అసలు మొదట్లో ఈ పాత్రకు ఇటు సౌత్, అటు నార్త్ ఇండియాలు రెండింటిలోనూ మంచి పేరున్న అలనాటి టాప్ హీరోయిన్ శ్రీదేవిని తీసుకుందామని అనుకున్నారట. రీఎంట్రీకి ఇది చాలా మంచి అవకాశం అవుతుందని అందరూ ఎంతలా చెప్పినా ఆమె మాత్రం ఈ పాత్ర చేయడానికి ససేమిరా అన్నారని తెలిసింది. 
 
బాహుబలి సినిమా పెద్దదని తెలుసు, భారీ విజయం సాధించే అవకాశం ఉంటుందని కూడా తెలుసు. అయినా ఇంత పెద్ద సినిమాలో అంత ముఖ్యమైన పాత్ర పోషించడానికి శ్రీదేవి ఎందుకు నిరాకరించారంటే.. అందుకు ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది.. ప్రభాస్ అంత పెద్ద కొడుక్కి తాను తల్లిగా చేయడం ఏంటని ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడం. రెండోది.. కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ అడగడం. ఈ రెండింటిలో అసలైన కారణం ఏదైనా శ్రీదేవి మాత్రం గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యిందంటూ బాలీవుడ్ నటీనటులు, దర్శకులు ఇప్పుడు చెబుతున్నారు. 
 
హిందీ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా రికార్డులను బద్దలు కొడుతున్న బాహుబలి లాంటి సినిమాలో ఎంత చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చినా కళ్లు మూసుకుని సరేనంటారు. రెండో భాగంలో తనకు మంచి అవకాశం ఇచ్చినందుకు సుబ్బరాజు కూడా ఆడియో రిలీజ్ సమయంలో దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. హాస్యనటుడు పృథ్వి చాలా కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. ఇలా ఎంతోమంది అంత పెద్ద సినిమా కాబట్టి తాము ఏదో ఒక పాత్ర చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ శివగామి లాంటి అత్యంత కీలకమైన పాత్ర పోషించే అవకాశం వచ్చినా.. శ్రీదేవి దాన్ని వదులుకోవడం చాలా పెద్ద పొరపాటని అంటున్నారు.
 
వాస్తవానికి శివగామి పాత్రకు రమ్యకృష్ణ అయితే సరిపోతారు అని బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథకుడిగా సరిగ్గానే అంచనా వేసి తనయుడు రాజమౌళికి తన అభిప్రాయం చెబితే నాన్న మాటల్ని రాజమౌళి కొట్టిపారేశారట. దేశవ్యాప్త మార్కెట్‌కు శ్రీదేవి ఎక్కువగా ఉపయోగపడుతుందనే రాజమౌళి అంచనా వేశారు తప్పితే అంత శక్తివంతమైన పాత్రను పోషించే ఔద్దత్యం, ఆ ఆధిపత్య ధోరణి శ్రీదేవికి ఉందా అనే సందేహం కూడా రాజమౌళికి రాలేదట. దాంతో పోలోమని శ్రీదేవికి విషయం చెప్పడం, వెంటనే ఆమె తిప్పి కొట్టడం జరిగిపోయింది. 
 
శ్రీదేవి శివగామి పాత్రను తిరస్కరించడం వల్ల ఆమె ఎంత నష్టపోయిందో కానీ రాజమౌళికి మాత్రం జీవితంలో మరవలేనంత పెద్ద లాభం కలిగింది. శ్రీదేవి తిరస్కరించగా శివగామి పాత్రను దక్కించుకున్న రమ్యకృష్ణ బాహుబలి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. పార్కుల్లో హీరోవెధవల వెంబడి తిరుగుతూ తైతక్కలాడే పాత్రలను కాకుండా బలమైన పాత్రలను మహిళలకు ఇస్తే ఏం జరుగుతుందో ఆ అద్భుతాన్ని బాహుబలి సాక్షిగా రమ్యకృష్ణ యావద్భారత చిత్రసీమకు నిరూపించి చూపింది. శ్రీదేవి చేసిన తప్పు రాజమౌళికి వరం అయితే బాహుబలికి ప్రాణం పోసింది.
 
ఆ తర్వాత రాజమౌళి తాను చేసిన తప్పును గ్రహించడమే కాకుండా పలు సార్లు పలు వేదికలపై రమ్యకృష్ణకు సారీ చెప్పారు. పక్కన ఒక శక్తి స్వరూపిణిని పట్టుకుని శివగామి పాత్రధారి కోసం ఎక్కడెక్కడో తిరిగాను. నన్ను క్షమించాలి అంటూ రాజమౌళి పదే పదే రమ్యకృష్ణను అభ్యర్థించారు.
 
శ్రీదేవి తిరస్కరించిన శివగామి పాత్ర అలా బాహుబలిలో రమ్యకృష్ణ రూపంలో మెరిసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

ఆర్టీసీ బస్సులో వృద్ధులకు రాయితీ.. మార్గదర్శకాలు ఇవే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments