Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఆ రహస్యం ఆ ముగ్గురికే తెలుసునట!

బాహుబలి 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు బాహుబలి 2 నుంచి సమాధానం తెలుసుకోవాలి.

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (11:45 IST)
బాహుబలి 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు బాహుబలి 2 నుంచి సమాధానం తెలుసుకోవాలి. బాహుబలి 2లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే రహస్యం రాజమౌళికి మాత్రమే తెలుసునని అందరూ అనుకున్నారు. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే రహస్యం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని ముగ్గురికి తెలిసిపోయిందని సినీ జనం అంటున్నారు. 
 
ఆ ముగ్గరు ఎవరంటే..? కట్టప్పగా నటించిన సత్యరాజ్, బాహుబలిగా నటించిన ప్రభాస్, ఈ బాహుబలిని కట్టప్ప చంపే సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు చేసిన నిర్మాత శోభు యార్లగడ్డ. ప్రస్తుతం ఈ ప్రశ్నపై వందల కోట్ల వ్యాపారం ఆధారపడినందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం ఎట్టిపరిస్థితుల్లో బయటకు పొక్కకుండా రాజమౌళి తగిన చర్యలు తసుకుంటున్నాడని సమాచారం. 
 
ఇంకా ఈ సన్నివేశాలను షూట్ చేసేటప్పుడు.. యూనిట్ సభ్యులకు తెలిసిపోతుందనుకున్న రాజమౌళి కేవలం ముగ్గురు వ్యక్తుల మధ్య చిత్రీకరించాడట. ఈ సన్నివేశం చిత్రీకరణ ప్రాంతంలో కట్టప్ప, బాహుబలి, శోభు యార్లగడ్డ మినహా ఎవ్వరూ లేకుండా చూసుకున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించడం.. వాటిని బయటికి పొక్కనీయకుండా చేయడంలో జక్కన్న పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలిసింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments