Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకున్న దంపతులను కలిపిన 'కరోనా'

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (13:10 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ మహమ్మారి మరింత విస్తరించకుండా ఉండేందుకు వీలుగా అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో అనేక మంది తమతమ గృహాలకే పరిమితమయ్యారు. వీరిలో చిన్నాపెద్ద, పేద, ధనిక అనే తేడాలేదు. ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళలోనే స్వీయనిర్బంధంలో ఉన్నారు. 
 
అయితే, ఈ కరోనా సమాజానికి చాలా కీడు చేస్తున్నప్పటికీ.. అక్కడక్కడా కొంత మేలు చేస్తోంది. గాలిలో కాలుష్యం గణనీయంగా తగ్గించింది. పాత సంప్రదాయాలను తిరిగి ప్రతి ఒక్కరూ పాటించేలా చేసింది. అలాగే, విడిపోయిన జంటలు తిరిగి కలుస్తున్నాయి. ఇపుడు ఓ బాలీవుడ్ దంపతులు ఇపుడు తమ పిల్లల కోసం కలిసిపోయారు. పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు మాజీ భార్య ... ఇపుడు మాజీ భర్త ఇంటికే వచ్చింది. ఆ దంపతులు ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. అతని భార్య సుసానే ఖాన్. హృతిక్ ‌​- సుసానే 2000 సంవత్సరంలో డిసెంబర్‌ 20న వివాహం చేసుకోగా, 2013 నుంచి దూరంగా ఉంటున్నారు. చివ‌రికి  2014లో విడాకులు తీసుకున్నారు.
 
వివరాల‌లోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ అత‌ని భార్య సుసానే ఖాన్ విడాకుల కార‌ణంగా కొద్ది రోజుల నుండి దూరంగా ఉంటున్నారు. కుమారులు హ్రేహాన్‌, హ్రిధాన్ కోసం అప్పుడ‌ప్పుడు క‌లిసి విహార‌యాత్ర‌ల‌కి వెళుతున్నారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన త‌మ పిల్ల‌ల క్షేమ ర‌క్ష‌ణ కోసం సుసానే ఖాన్ తిరిగి త‌న మాజీ భ‌ర్త ఇంటికి చేరుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని హృతిక్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా తెలిపాడు. 
 
'దేశంలో లాక్‌డౌన్ విధించిన స‌మయంలో త‌ల్లిదండ్రులుగా ఒకే చోట క‌లిసి ఉండ‌డం అస్స‌లు ఊహించ‌లేక‌పోతున్నాను. క‌రోనాని క‌ట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటిస్తూ ప్ర‌పంచ‌మంతా ఏక‌తాటిపై రావ‌డం బాగుంది. మాన‌వ‌త్వం వెల్లివిరుస్తున్న త‌రుణంలో అంద‌రు క‌లిసిక‌ట్టుగా ఉండ‌టం ఎంతో ముఖ్యం. మీరు చూస్తున్న‌ది నా మాజీ భార్య సుసానే ఖాన్ ఫోటో. ఈమె ఎంతో ద‌య‌గ‌ల వ్య‌క్తి. ఈ స‌మ‌యంలో పిల్ల‌ల‌కి దూరంగా ఉండ‌కూడ‌ద‌ని త‌న‌కు తానుగా ఇక్క‌డికి చేరుకుంది. కో పేరెంటింగ్‌లో ఎంత‌గానో స‌హ‌క‌రిస్తున్న సుసానేకి ధ‌న్య‌వాదాలు. మన పిల్లల కోసం మనం సృష్టిస్తున్న కథను వాళ్లే చెబుతారు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సుసానే ఫొటోకు క్యాప్షన్‌ జతచేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments