Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి నివాసంలో సినీ స‌మ‌స్య‌ల మీటింగ్‌కు బాల‌కృష్ణ ఎందుకు రాలేదు?

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:25 IST)
Balakrishna
ప్ర‌స్తుతం సినిమారంగంలో హాట్ టాపిక్ మొన్న‌ మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో సినీరంగం ప్ర‌ముఖులు స‌మావేశం కావ‌డం. వై.ఎస్‌. జ‌గ‌న్ సినిమా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి చిరంజీవిని ఆంధ్ర మంత్రి పేర్ని నానిని పంపించ‌డం అందుకు సానుకూలంగా స్పందించ‌డం జ‌రిగాయి. ఇది జ‌రిగిన మ‌రుస‌టి రోజే మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్ర‌ముఖ వ్య‌క్తులంతా స‌మావేశంలో పాల్గొన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, నాగార్జున, అల్లు అరవింద్,నిర్మాత‌ల సంఘం, పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. 
 
కాగా, ఇంత‌మంది హాజ‌రైతే నంద‌మూరి బాల‌కృష్ణ ఎందుకు మీటింగ్‌లో లేడు? ఆయ‌న్ను ఎందుకు పిల‌వ‌లేద‌నే దానిపై మీడియాలోనూ సినీరంగంలోనూ పెద్ద చ‌ర్చ జ‌రుగుతుంది. దీనిపై బాల‌య్య ఫ్యాన్స్ అధ్య‌క్షుడు కొండ‌ల‌రావు కూడా త‌మ‌కు ఈ విష‌య‌మై పూర్తి స‌మావేశంలేద‌ని చెప్పారు. ఇదే విధంగా ప‌లువురు స్పందించారు. అయితే వెబ్ దునియా సేక‌రించిన స‌మ‌చారం ప్ర‌కారం, చిరంజీవిగారు బాల‌య్య‌బాబుకు ఆహ్వానించార‌ట‌. ఈ విష‌యాన్ని బాల‌య్య‌కు అతి స‌న్నిహితుడు ఆయ‌న‌తో సినిమాలు చేయ‌బోతున్న సి. క‌ళ్యాణ్ స‌మాధాన‌మిచ్చారు. గ‌తంలో జ‌రిగిన‌ట్లుకాకుండా ఈసారి అలాంటి త‌ప్పిదాలు జ‌ర‌గ‌లేదు. బాల‌య్య‌బాబును పిలిచారు. స‌మ‌స్య‌లు ఇలా చ‌ర్చిస్తున్నామ‌ని చిరంజీవి ఫోన్లో తెలియ‌జేశారు. అందుకు బాల‌య్య మీరు ఎటువంటి నిర్ణ‌యాలు సినీమారంగం బాగు కోసం చేసినా దానికి స‌మ్మ‌త‌న‌మే అని ఆయ‌న చెప్పార‌ని.. సి.క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.
 
అయితే గ‌తంలో బాల‌య్య‌బాబు.. ఇలా వై.ఎస్‌.జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ వంటివారు వెళ్ళిన‌ప్పుడు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వెళ్ళిన‌ట్లుగా రియాక్ట్ అయ్యారు. అది పెద్ద చ‌ర్చ‌కు తావిచ్చింది. అందుకే ఈసారి అలా కాకుండా వుండాల‌నే ముందుగా బాల‌య్య‌కు తెలియ‌జెప్పిన  త‌ర్వాతే చిరంజీవి త‌న నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేశార‌ని తెలిసింది. అయితే బాల‌య్య‌.. ఆగ‌స్టు 15న కేన్స‌ర్ ఆసుప‌త్రిలో ప‌లు కార్య‌క్ర‌మాలు వుండ‌డంల్ల రాలేక‌పోతున్న‌ట్లుగా చెప్పిన‌ట్లు సి.క‌ళ్యాణ్ వెబ్‌దునియాకు తెలియ‌జేశారు. సో. ఈనెలాఖ‌రున వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లిసే టీమ్‌లో బాల‌య్య‌కూడా వుండొచ్చ‌ని సినీరంగం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments