Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమా బయటకు వస్తుందో రాదో ఎవడికి తెలుసు? తన చిత్రంపై వినాయక్ సెటైర్

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (20:07 IST)
మాస్ సినిమా అనగానే... ఈ కాలంలో గుర్తుకువచ్చే డైరెక్టర్ వి.వి.వినాయక్. అభిరుచి గల నిర్మాత రాజును దిల్ సినిమాతో దిల్ రాజు చేసేసారు. అప్పటి నుంచి నిర్మాత దిల్ రాజు - దర్శకుడు వినాయక్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే... ఎందుకు అనిపించిందో ఏమో కానీ... వినాయక్‌ని హీరోగా పెట్టి సినిమా తీయాలనిపించింది దిల్ రాజుకు.
 
అంతే... వినాయక్‌కి ఓ రోజు ఈ విషయం చెప్పడం... వినాయక్ కూడా ఓకే అనడం జరిగింది. అంతేనా... శీనయ్య అనే టైటిల్‌తో సినిమాని గ్రాండ్‌గా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే వీళ్లు ఎంత ఫాస్ట్‌గా ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొచ్చారో అంతే ఫాస్ట్‌గా అది సైడ్ ట్రాక్ లోకి కూడా వెళ్లిపోయింది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ సైడ్‌కి వెళ్లిపోయిందంటే... అనేక కారణాలు.
 
కథ సరిగా లేదని.. డైరెక్టర్ చెప్పింది వినాయక్‌కి నచ్చడం లేదని... ఇప్పటి వరకు షూట్ చేసిన రష్ చూసుకుంటే సరిగా రాలేదని... ఇలా చాలా కారణాలు వున్నాయి కానీ... అసలు ఈ సినిమా ఉందా..? లేదా..? అనేది మాత్రం అఫిషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే.. క్లారిటీ లేని ఈ సినిమా గురించి శీనయ్య అదేనండి వినాయక్ స్పందించాడు.
 
ఇంతకీ ఏమన్నాడంటే... శీనయ్య సినిమా వస్తుందా అని అడిగితే... ఏమో ఎవడికి తెలుసంటూ సెటైరిక్‌గా సమాధానమిచ్చాడు వినాయక్. తను కేవలం బరువు తగ్గడం కోసమే ఆ సినిమా ఒప్పుకున్నానని.. తనకు మాత్రం తృప్తిగా ఉందన్నాడు. ఈ విధంగా శీనయ్య సినిమా రాదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments